LIC: కొంపముంచింది..ఉన్నదంతా ఊడ్చేసింది: నష్టాల్లో నెక్స్ట్ లెవెల్
ముంబై: జీవిత బీమా సంస్థ షేర్ల ధరల పతనం కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్స్‌లో ఎల్ఐసీ షేర్ల ధరలు ఇవ్వాళ మరింత దిగజారాయి. ఒక్కో షేర్ ధర 800 రూపాయల కంటే దిగువకు పడిపోయింది. కటాఫ్ ప్రైస్‌తో పోల్చుకుని చూస్తే- రూ.172.50 పైసల నష్టాన్ని మిగిల్చిందీ లైఫ్ ఇన్సూరెన్స్ జెయింట్. దీని ఫలితంగా ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌పై కుప్పకూలింది. ఎల్ఐసీ స్టాక్స్‌పై అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది. రిటైల్ ఇన్వెస్టర్లు- తక్కువ నష్టంతోనైనా షేర్లను విక్రయించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు.

లిస్టింగ్ రోజే బిగ్ షాక్..
ఎల్‌ఐసీ ఐపీఓ లాంచింగ్‌కు ముందు.. ఆ తరువాత మంచి బజ్ లభించింది గానీ- దాన్ని కాపాడుకోలేకపోయింది. స్టాక్ మార్కెట్స్‌లో వరస్ట్ పెర్‌ఫార్మ్‌గా చేసింది. మైనస్‌లో లిస్ట్ అయింది. ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. 21,000 కోట్ల రూపాయలను సమీకరించడానికి జారీ అయిన పబ్లిక్ ఇష్యూ ఇది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.902-949 రూపాయలు కాగా 10 శాతం నష్టంతో బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయింది.

ఇవ్వాళ రూ.23కు పైగా నష్టం..
శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో రూ.800.45 పైసల వద్ద ఎల్ఐసీ ట్రేడింగ్ ముగియగా.. ఇవ్వాళ- ఈ ధర మరింత పడిపోయింది. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.776.50 పైసల వద్ద ట్రేడ్ అయింది. కటాఫ్ ప్రైస్ 949 రూపాయలు గా.. ఇవ్వాళ్టి ట్రేడింగ్ ప్రైస్ రూ.776.50 పైసలు. దీన్ని బట్టి ఎల్ఐసీ షేర్ ఏ స్థాయిలో నష్టపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే 15 రూపాయల మేర నష్టాన్ని ఇన్వెస్టర్లకు పంచింది.

రూ. లక్షకోట్లకుపైగా..
దీని ప్రభావం ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మీద కూడా పడింది. తొలి రెండుగంటల వ్యవధిలోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయింది. సాయంత్రానికి మరింత పెరిగింది. శుక్రవారం నాడు ఎల్ఐసీ మార్కెట్ క్యాప్.. 6,00,242 కోట్ల రూపాయలు. కాగా ఇవ్వాళ తొలి రెండు గంటల్లోనే ఈ సంఖ్య అయిదు లక్షల దిగువకు పడిపోయింది. 4,97,334 కోట్ల రూపాయలు చేరింది. 15 ట్రేడింగ్ సెషన్లల్లో ఎల్ఐసీ ఇన్వెస్టర్లు మొత్తంగా 1,02,908 కోట్ల రూపాయలను నష్టపోయింది.

రోజురోజూ పతనం..
ఎల్ఐసీ షేర్ ధర ప్రతిరోజూ నేలచూపులు చూస్తూనే వస్తోంది. ఇవ్వాళ లోయెస్ట్ ప్రైస్‌ను నమోదు చేసింది. రూ.776.50 పైసలు అనేది ఎల్ఐసీ లోయెస్ట్ ట్రేడింగ్ ప్రైస్. ఒక్కో షేర్ మీద రూ.172.50 పైసల రూపాయల నష్టం వచ్చింది. దీని ట్రేడింగ్ గ్రాఫ్ ఇంకా నేల చూపులు చూస్తూ వస్తోందే తప్ప పైకి ఎగబాకట్లేదు.

భవిష్యత్తేంటో..
కాగా- ఎల్ఐసీ షేర్లను హోల్డ్ చేసి ఉంచొచ్చంటూ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎల్ఐసీ షేర్ల టార్గెట్ ప్రైస్ 875 రూపాయలుగా నిర్ధారించారు. భవిష్యత్‌లో షేర్ల ధర క్రమంగా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. కటాఫ్ ప్రైస్‌ను అందుకోవడం ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చని ఎంకే గ్లోబల్ అంచనా వేసింది. ఎల్ఐసీ ఇన్వెస్టర్లు ఇప్పట్లో లాభాలను చవి చూడబోరని, నష్టాన్ని కొంత మేర పూడ్చుకోవడానికి మాత్రమే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications