Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేపు సెలవును ప్రకటించిన ప్రభుత్వం

SM Krishna: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

బెంగళూరులోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం ఆయన స్వగ్రామం- మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా పరిధిలో గల సోమణహళ్లిలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనుంది.

SM Krishna demise Karnataka Govt announced holiday for the on December 11

ఎస్ఎం కృష్ణ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధితనే మల్లికార్జున్ ఖర్గే, పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. సేవలను స్మరించుకున్నారు.

సిద్ధరామయ్య ప్రస్తుతం బెళగావి పర్యటనలో ఉన్నారు. ఎస్ఎం కృష్ణ మరణవార్త విన్న వెంటనే హుటాహుటిన బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. తన బెళగావి పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. ఇంకొద్దిసేపట్లో ఆయన బెంగళూరుకు చేరుకోనున్నారు. ఎస్ఎం కృష్ణ నివాసానికి వెళ్లి నివాళి అర్పించనున్నారు.

ఆయన మృతి పట్ల మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటించనుంది కర్ణాటక ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ఉప ప్రధాన కార్యదర్శి ఎలీషా ఆండ్రూస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు రోజుల పాటు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు, ఉత్సవాలు, వేడుకలను నిర్వహించకూడదని సూచించారు.

బుధవారం నాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్ఎం కృష్ణ పార్థివదేహానికి అంత్యక్రియలను నిర్వహించనున్న నేపథ్యంలో సెలవును ప్రకటించింది ప్రభుత్వం. సంతాప సూచకంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనిచేయవు.

ఆయన పూర్తి పేరు సోమణహళ్లి మల్లయ్య కృష్ణ. 1932 మే 1వ తేదీన మండ్య జిల్లాలోని సోమణహళ్లిలో జన్మించారు. 1960లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1962లో మద్దూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1968 నాటి లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసి గెలిచారు.

క్రమంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ కాలంలోనే బెంగళూరు సిలికాన్ సిటీగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఐటీ హబ్‌గా, సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కేంద్రబిందువుగా రూపాంతంరం చెందింది.

2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు. 2017లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+