కేవ‌లం 35 మంది ఓట‌ర్ల కోసం అతి చిన్న పోలింగ్ బూత్‌.. ఎక్క‌డో తెలుసా..?

ప్ర‌స్తుతం దేశంలో ఎలక్ష‌న్స్ టైం న‌డుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల హాడావుడి మొద‌లయ్యింది. ఇప్ప‌టికే ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలు పోలింగ్‌ను కూడా పూర్తిచేసుకున్నాయి. ఇక ఈ నెల 25న ఒక రాష్ట్రంలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అంత‌కుముందే ఆ రాష్ట్రం పేరు వార్త‌ల్లోకెక్కింది. ఆ రాష్ట్ర‌మే రాజస్థాన్‌. ఇక్క‌డ‌ నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో అతి చిన్న పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసింది ఎన్నిక‌ల సంఘం.

అది కూడా కేవ‌లం 35 మంది ఓట‌ర్ల కోస‌మే. విన‌డానికి ఆశ్చ‌ర్యంగానే ఉన్నా. ఇది నిజం.. ప్ర‌తి ఒక్క ఓటు ఎంతో కీల‌కమైన‌ది. ఒక్క ఓటుతో ఎన్నో ప్ర‌భుత్వాలు కూలిపోయిన సంఘ‌ట‌న‌లు గ‌తంలో చూశాం. ఒక్క ఓటు వ్య‌క్తుల త‌ల‌రాత‌ల‌నే మారుస్తుంది. అందుకే, ఈ గ్రామంలో ఉన్న ఆ 35 మంది ఓట‌ర్లు ఓట్లు కూడా ఎంతో కీల‌కంగా మారాయి. వీరికోసం ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేకంగా ఓ చిన్న బూత్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేప‌థ్యంలో ఈ గ్రామం పేరు ఇప్పుడు వార్త‌ల్లోకెక్కింది.

Smallest polling booth for only 35 voters.. Do you know where..?

ఒక్క కుటుంబం కోసం పోలింగ్ బూత్‌ : బార్మర్ జిల్లాలోని బాద్మేర్ కా పార్‌లో ఒకే ఒక్క‌ కుటుంబం ఉంటుంది. ఈ ప్రాంతం పాకిస్థాన్‌, భారత్‌ సరిహద్దులో ఉంది. ఈ కుటుంబంలో కేవ‌లం 35 మంది మాత్ర‌మే ఉంటారు. ఈ గ్రామంలో కేవ‌లం ఈ ఒక్క గ్రామ‌మే ఉంది. ఈ 35 మందిలో 18 మంది పురుషులు, 17 మంది మ‌హిళ‌లు నివ‌సిస్తున్నారు. ఈసీ అధికారులు కేవ‌లం వీరికోసం ప్ర‌త్యేకంగా ఓ పోలింగ్‌బూత్‌ను ఏర్పాటు చేశారు.

ఓటు వేయాలంటే 20 కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సిందే : ఈ కుటుంబ స‌భ్యులు కూడా ఓటు వేసేందుకు ముందుకు వ‌చ్చేవారు కాదు. ఎందుకంటే ఓటు వేయాలంటే సుమారు 20 కిలోమీట‌ర్లు కాలిన‌డ‌క‌న ప్ర‌యాణించాలి. కాలిన‌డ‌క మార్గ‌మే ఈ గ్రామానికి ఉన్న ఏకైక మార్గం. లేక‌పోతే ఒంటెల‌పై ప్ర‌యాణించేవారు. కానీ, అది కూడా వారికి సాహసంతో కూడుకున్న ప‌నే. ఒక్కోసారి అదుపుత‌ప్పి ప‌డిపోతే గాయాల‌పాల య్యేవారు. అందుకే ఈ కుటుంబంలోని వృద్ధులు, మ‌హిళ‌లు ఓటు వేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూపేవారు కాదు. ఈ కార‌ణాల దృష్ట్యా ఎన్నిక‌ల అధికారుల వారికి స‌మీపంలోని అతి చిన్న పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. దాంతో వారు ఎంతో దూరం న‌డ‌వాల్సిన అవ‌స‌రం లేదు. ఈ సారి అసెంబ్లీ ఎన్నిక‌లకు ఈ కుటుంబంలోని పురుషులతో పాటు మ‌హిళలు, వృద్ధులు కూడా త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+