కేంద్రమంత్రినే ఫిదా చేసింది: పాపులర్ సింగర్ కూతురితో గారాలు పోయిన స్మృతి..

Subscribe to Oneindia Telugu

ముంబై: బోసినవ్వులతో చూడగానే ముద్దొచ్చే చిన్నారులంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. వాళ్లను ఆడిస్తూ.. లాలిస్తూ.. అలానే ఉండిపోవాలనిపిస్తుంది. అంతలా మాయ చేస్తారు పిల్లలు. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కూడా ఓ చిన్నారి మాయ చేసింది.

ఆప్యాయంగా ఆ చిన్నారిని ఎత్తుకున్న స్మృతి.. తల్లి లాగే తెగ సంబరపడిపోయింది. బోసినవ్వులతో ఆ చిన్నారి నవ్వుతుంటే.. తను కూడా మురిసిపోయింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరనుకుంటున్నారా?.. ఇంకెవరు.. పాపులర్ సింగర్ అద్నాన్‌సమి గారాల పట్టి మెదీనా.

సోమవారం అద్నాన్‌ సమి తన భార్య, కుమార్తె మెదీనాతో కలిసి కేంద్రమంత్రి స్మృతిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మెదీనాతో స్మృతి చాలాసేపు గడిపింది. చిన్నారిని ఆడిస్తూ గారాలు పోయింది. ఈ చిత్రాలను అద్నాన్ సమి తన కెమెరాలో బంధించారు.

ఆపై తన సోషల్ మీడియా ఖాతాలో వీటిని పోస్టు చేసి.. 'ఓ చక్కటి చిత్రం వెయ్యి భావాలను పలుకుతుంది. ఇరానీజీ, మెదీనా మధ్య లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌‌కు ఇది నిదర్శనం. కృతజ్ఞతలు..' అంటూ అద్నాన్ సమి పేర్కొన్నారు. నెటిజెన్స్ అంతా ఈ ఫోటోలను ముచ్చటపడి చూస్తున్నారు.

కాగా, మొన్నీమధ్యే అద్నాన్ సమి తన భార్య, కుమార్తెతో కలిసి మోడీని కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో మెదీనా బుగ్గ పట్టుకుని మోడీ ముద్దాడిన ఫోటో నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Adnan Sami’s daughter Medina is one of the most popular celebrity kids on social media.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X