పేపర్‌పై రాసుకొని: సోనియాకు స్మృతి ఇరానీ ఘాటుగా
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం నాడు కౌంటర్ ఇచ్చారు. వ్యాపం, 25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, లలిత్ గేట్ అంశాలు పార్లమెంటును కుదిపేస్తున్నాయి.
లలిత్ గేట్ పైన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వడం, ఆ తర్వాత దానిపై సోనియా గాంధీ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్మృతి ఇరాని తనదైన శైలిలో సోనియా పైన విరుచుకుపడ్డారు. ఘాటైన విమర్శలు చేశారు.
ఏదైనా అంశం పైన ప్రసంగం ఇవ్వడం సోనియా గాంధీకి అంత సులభం కాదన్నారు. ప్రసంగ పాఠాన్ని పేపర్ పైన రాసుకొని సాంతం చదువుకున్నాకే మాట్లాడగలరని ఎద్దేవా చేశారు.

సుష్మ పైన చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పార్లమెంటును వారు స్టేజి అనగరలా అని నిలదీశారు. సుష్మా మాటల గారడి చేస్తున్నారన్న వ్యాఖ్యలను స్మృతి ఇరానీ తప్పుబట్టారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ ఎంపీల సస్పెన్షన్ పైన నాలుగు రోజులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఎన్డీఏ ప్రభుత్వంపైనే కాక ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పై కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications