అమేథీలో ప్రియాంక పిఏ చక్కర్లు: స్మృతి ఇరానీ ప్రశ్న
లక్నో: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ పిఏ ప్రీతి సహాయ్ ప్రత్యక్షమైంది. ఆమెను చూసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి స్మృతి ఇరానీ వెంటనే జిల్లా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
స్పందించిన అధికారి.. పోలింగ్ ప్రాంతాన్నీ విడిచి వెళ్లాలని ప్రియాంక పిఏను ఆదేశించారు. పోలింగ్ బూత్ లోపలో ఉండటానికి ప్రియాంక పిఎకు ఎలాంటి హక్కు ఉందని అనంతరం స్మృతి ఇరానీ అన్నారు. తన అథారిటీ లెటర్‌ను ఆమెను అడిగనప్పుడు బయటికి వెళ్లిందని చెప్పారు.

దీనిపై స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీ సెక్రటరీ ప్రీతి సహాయ్ థోరీ పోలింగ్ బూత్‌లో తచ్చాడారని, స్థానికులు కాకపోయినా ఉన్నారని, పైగా తాను అక్కడ ఉండటాన్ని ప్రశ్నించారని ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గమైన అమేథీకి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ వచ్చిన విషయం తెలిసిందే. పలు వాహనాల్లో తన అనుచరులతో కలసి పోలింగ్ ప్రాంతాల్లో తిరిగారు. పోలింగ్ జరుగుతున్న వేళ ఏ అభ్యర్థి అయినా భారీ కాన్వాయ్‌తో రోడ్ షో చేయడంతో.. రాహుల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications