మందు బాటిల్‌లో నాగరాజు.. తాగాక చూసిన బాబు, దిమ్మతిరిగి బొమ్మ పడింది..
పాము అంటేనే భయం.. దూరం నుంచి చూసి కూడా భయపడతారు. అయితే వాటర్ బాటిల్, మందు బాటిల్‌లో పాము/ పాము పిల్ల కనిపిస్తే అంతే సంగతులు. గుండె గుబేల్ మనడం ఖాయం. తమిళనాడులో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మందుబాబు.. బాటిల్‌లో గల మందు తాగేశాడు. తర్వాత నిశీతంగా గమనిస్తే అర్థమయ్యింది. అందులో పాము పిల్ల ఉందని చూశాడు. అప్పటివరకు తాగిన లిక్కర్ అంతా దిగిపోయింది. ఏం చేయాలిరా భగవంతుడా అని తల పట్టుకొని మరీ కూర్చున్నాడు.

మందు బాటిల్ కొని..
అరియాలూరు జిల్లా చుట్టమల్లి గ్రామానికి చెందిన సురేష్ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటు జీవిస్తున్నాడు. రోజంతా పనిచేయటంతో ఒళ్లంతా అలసిపోవటంతో కాస్తంత మందు తాగి పడుకుంటాడు. గత బుధవారం వ్యవసాయ పనులు ముగించుకొని వైన్ షాప్‌కు వెళ్లి ప్రభుత్వ ఆధీనంలో నడిచే టాస్మాక్ దుకాణంలో ఓ మద్యం బాటిల్ కొనుక్కుని దాన్ని పట్టుకుని ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత.. తెచ్చుకున్న మద్యం నుంచి సగం గ్లాస్‌లో పోసుకొని తాగాడు. ఆ తర్వాత సీసాలో అతడికి ఏదో ఉన్నట్లుగా అనుమానం వచ్చింది. పరిశీలనగా చూశాడు. అదేదో పాము పిల్లలాగా కనిపించింది.

బాటిల్‌లో పాము పిల్ల
కొంచెం మత్తు ఎక్కుతుండటంతో అదేదో తన భ్రమేమో అనుకున్నాడు. కళ్లు విప్పార్చుకుని మరోసారి చూశాడు. సీసా అడుగు భాగంలో చనిపోయిన పాము పిల్ల కనిపించింది. అంతే తాగింది మొత్తం దిగిపోయింది. అది చూసిన సురేష్ భయపడిపోయాడు. అప్పటికే కొంత మద్యం తాగడంతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందాడు. ఆగమాగం అయిపోయాడు. అదే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పగా..వాళ్లు కూడా కంగారుగా సురేష్‌ను హుటాహుటిన జయకొండం ఆస్పత్రికి తరలించారు. విషయాన్ని డాక్టర్లకు చెప్పారు. దాంతో మద్యం బాటిల్ లో ఉన్న పాముపిల్లను పరిశీలించిన డాక్టర్లు అతనికి వైద్యం చేశారు. ఫరవాలేదు అని భరోసా ఇచ్చారు.

వైన్ షాప్ మీద గొడవ
సురేష్ కుటుంబ సభ్యులంతా వైన్ షాప్ మీదకు దండయాత్రకు వెళ్లారు. ఈ బాటిల్ మేమేమన్నా తయారు చేశామా? సీల్ వేశామా? అని ఎదురు ప్రశ్నించారు. దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేం కేవలం మద్యం మాత్రమే అమ్ముతామని స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో వాళ్లకు తెలియలేదు. సురేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మద్యం బాటిల్‌లో పాము రావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే మద్యం షాపుల్లోనే ఇలా జరిగితే ఇక ప్రజల పరిస్థితి ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications