'ఆ చీపురుతోనే మోడీని కేజ్రీ ఊడ్చేశారు': నాడు కాంగ్రెస్‌కు, నేడు బీజేపీకి
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు, భారతీయ జనతా పార్టీ ఓటమిల పైన సోషల్ మీడియాలో అభినందనలు, విమర్శలు వెల్లువెత్తాయి. కేజ్రీవాల్‌కు ప్రశంసలు కురిపించిన నెటిజన్లు, ప్రధాని నరేంద్ర మోడీ పైన సెటైర్లు వేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా చురకలు వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మూటాముల్లె సర్దేసుకొని పలాయం చిత్తగించాలని కొందరు వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఢిల్లీ ఓటర్లు మోడీని ఊడ్చిపారేశారని కొందరు పేర్కొన్నారు. రాజధానిలో మోడీ హవా, అమిత్ షా మేజిక్ ఏమీ లేదని అర్థమవుతోందన్నారు.

కేవలం కాంగ్రెస్ చేసిన తప్పిదాలే ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేశాయని మరికొందరు పేర్కొన్నారు. చాయ్‌వాలా అంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ లక్షలు పెట్టి సూట్లు కుట్టించుకోవడాన్ని ప్రజలు కనిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రముఖ వ్యక్తులు చేతన్ భగత్, శేఖర్ కపూర్, అశుతోష్, సాధవి ఖోస్లా దలాల్ తదితర ఎందరో స్పందించారు.
నాడు కాంగ్రెస్‌కు జరిగిన పరాభవం.. నేడు బీజేపీకి
నాడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జరిగిన పరాభవం నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి జరిగింది. పదేళ్ల యూపీఏ పాలన వైఫల్యం, మోడీ హవా కారణంగా బీజేపీ నాడు ఘన విజయం సాధించింది. ఆ హవా నిన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగింది. మోడీ హవా కారణంగా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇప్పుడు కేజ్రీవాల్ ధాటికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కూడా ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications