వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కత్తితో బెదిరించి బెడ్ రూంలో మాజీ ప్రియురాలిపై అత్యాచారం, ఇద్దరూ టెక్కీలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మాజీ ప్రియురాలిని కత్తితో బెదిరించి ఆమె మీద సాఫ్ట్ వేర్ ఇంజనీరు అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేరళకు చెందిన ప్రవీణ్ బాలా (25) అనే టెక్కీని అరెస్టు చేశామని హెచ్ఏఎల్ పోలీసులు తెలిపారు.

ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 25 ఏళ్ల యువతి 2017లో బెంగళూరు చేరుకుని ప్రసిద్ధి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగంలో చేరింది. ఆ సందర్బంలో కేరళకు చెందిన ప్రవీణ్ బాలా అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో ఆమెకు పరిచయం పెంచుకుంది.

ఇద్దరూ కలిసి మారతహళ్ళి రింగ్ రోడ్డు సమీపంలోని దోడ్డనక్కుందిలో అద్దె ఇల్లు తీసుకుని కలిసే ఉంటున్నారు. యువతి, ప్రవీణ్ బాలా ప్రేమించుకున్నారు. తరువాత ఇద్దరూ దోడ్డనక్కుంది సమీపంలోని ఒకే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగంలో చేరారు.

Software engineer allegedly raped ex girlfriend near HAL in Bengaluru

ఆరు నెలల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ప్రేమికులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. యువతి పీజీలో నివాసం ఉంటున్నది. ప్రవీణ్ బాలా అదే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఇద్దరూ విడిపోయినా స్నేహంగానే ఉంటున్నారు.

గత శుక్రవారం నీకు పార్శిల్ వచ్చిందని, వచ్చి తీసుకుపోవాలని ప్రవీణ్ బాలా మాజీ ప్రియురాలికి ఫోన్ చేసి చెప్పాడు. యువతి ఉదయం 11,30 గంటలకు ప్రవీణ్ బాలా ఇంటి దగ్గరకు వెళ్లింది. ఎలాంటి పార్శిల్ రాలేదని, ప్రవీణ్ బాలా అపద్దం చెప్పి పిలిపించాడని యువతికి అర్థం అయ్యింది.

పీజీ దగ్గర డ్రాప్ చెయ్యాలని యువతి ప్రవీణ్ బాలాకు చెప్పింది. ఇంకా కొంత సేపు ఉండాలని ప్రవీణ్ బాలా ఆమెకు చెప్పాడు. అందుకు మాజీ ప్రియురాలు నిరాకరించడంతో వంట గదిలో ఉన్న కత్తి తీసుకుని బెదిరించి బెడ్ రూంలో తన మీద అత్యాచారం చేశాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రవీణ్ బాలాను అరెస్టు చేసి జైలుకు పంపించారు. యువతికి వైద్యపరీక్షలు చేయించామని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
A software engineer from Kerala who is living in Bengaluru has allegedly raped his ex girl friend at his residence on Friday morning. HAL police have registered in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X