సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య: భార్య పాత్రపై అనుమానం

టెక్కీ హత్య కేసులో భార్య పాత్రపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. గురువారంనాడు భర్త దయాకర్‌తో గొడవ పడి భార్య వైశాలి తన తల్లిగారింటికి వెళ్లింది. గురువారం రాత్రి ఏదో విషయంపై ఇరువురి మధ్య పెద్ద వాగ్వివాదమే చోటు చేసుకుంది.
దాడి జరిగిన శబ్దాలు కూడా ఇంట్లోంచి వినిపించాయని పొరుగువారు పోలీసులకు చెప్పారు. భర్తతో గురువారం రాత్రి గొడవ పడిన వైశాలి శుక్రవారం ఉదయం తన తల్లిగారింటికి వెళ్లింది. ఆదివారంనాడు వైశాలి తన తండ్రితో కలిసి ఇంటికి వచ్చింది. అయితే, బయట ఇంటి ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంది.
వైశాలి ఇంట్లోకి వెళ్లేసరికి దయాకర్ శవం రక్తమడుగులో పడి ఉంది. దయాకర్ తలపై కొట్టినట్లు దెబ్బలు కనిపించాయి. వైశాలిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాల నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications