Solar eclipse 2022: హైదరాబాదులో సూర్య గ్రహణం ఎప్పుడు ఏ సమయంలో కనిపిస్తుంది..?

హైదరాబాద్: 2022వ సంవత్సరంలో రెండవది మరియు చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది.ఈ సారి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో గ్రహణం ఏర్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సారి పాక్షిక సూర్యగ్రహణం 25 అక్టోబర్ 2022న రాబోతోంది. అయితే భారత్‌లో సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో కనిపిస్తుందో తెలుసుకుందాం.

అక్టోబర్ 25వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం ఐరోపా, ఈశాన్య ఆఫ్రికా మరియు పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాల్లో దర్శనమివ్వనుంది.భారత్‌లో కూడా పలు నగరాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది.ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ఉజ్జయిని, వారణాసి మధుర, హైదరాబాద్‌లతో పాటు మరికొన్ని నగరాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది.

Solar Eclipse 2022:Know the timings in Hyderabad, Dos and Donts of the eclipse

*ఢిల్లీలో సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమవుతుంది.

*ముంబైలో సాయంత్రం 4:49 గంటలకు ప్రారంభమవుతుంది

* చెన్నైలో సూర్యగ్రహణం సాయంత్రం 5:14 గంటలకు ప్రారంభమవుతుంది

* హైదరాబాదులో సాయంత్రం 4:59 గంటలకు ప్రారంభమై 5:48 నిమిషాలకు ముగుస్తుంది

* గ్రహణం యొక్క వ్యవధి (ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు) ఢిల్లీ మరియు ముంబై రెండింటికీ వరుసగా 1 గంట 13 నిమిషాలు మరియు 1 గంట 19 నిమిషాలు ఉంటుంది.

అసలు సూర్యగ్రహణం అంటే ఏంటి..?

సూర్యునికి మరియు భూమికి మధ్య చంద్రుడు వచ్చి కొంత సమయం వరకు సూర్యకాంతిని భూమికి చేరకుండా అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.దీంతో చంద్రుడి నీడ భూమిపై పడి సూర్యుడిలోని కొంత భాగం కనిపించదు. సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు. గ్రహణం వీక్షించేందుకు ప్రత్యేక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అల్యూమినైజ్డ్ మైలార్, బ్లాక్ పాలిమర్, వెల్డింగ్ గ్లాసెస్ వంటివాటితో సూర్య గ్రహణం వీక్షించొచ్చు.

లేదా టెలిస్కోప్ ద్వారా సూర్యగ్రహణం చూడొచ్చు. ఇక గ్రహణం సమయంలో చిన్నపిల్లలను దూరంగా ఉంచండి. బయటకు పంపకూడదంటూ నిపుణులు సూచిస్తున్నారు. లేదా తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలతో గ్రహణం వీక్షించొచ్చు. తదుపరి సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న భారతదేశం నుండి కనిపిస్తుంది. వాస్తవానికి ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇది పాక్షిక సూర్యగ్రహణంలా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+