మళ్లీ తెగబడ్డ ఉగ్రవాదులు : జవాన్ మృతి, తిప్పికొడుతోన్న ఇండియన్ ఆర్మీ,
శ్రీనగర్ : తాంగ్ ధర్ నియంత్రణ రేఖ నుంచి మరోసారి జమ్ముకాశ్మీర్ లోకి చొరబడేందుకు యత్నించారు పాక్ ఉగ్రవాదులు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో.. భారత సైన్యం ధీటుగా కాల్పులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. కాల్పుల్లో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోగా.. మరో జవాన్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

నియంత్రణ రేఖ నుంచి భారత్ లోకి చొరబడే క్రమంలో.. విచక్షణా రహితంగా ఇండియన్ ఆర్మీపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. క్షణాల వ్యవధిలో అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. చొరబాటును అడ్డుకుని ఉగ్రవాదులను హతమార్చేందుకు ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ ఇంకా కాల్పులను కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications