మానవ హక్కుల్లో కూడా లాభనష్టాలా?: ఆ ‘కొంతమంది’తో ప్రమాదమంటూ ప్రధాని మోడీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మానవ హక్కుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ లాభాలు, నష్టాలను బేరీజు వేసుకొని మానవ హక్కుల గురించి మాట్లాడటం ప్రజాస్వామ్యానికి హానికరమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. మానవ హక్కుల పేరుతో కొందరు వ్యక్తులు దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మానవ హక్కులను అలా చూడటం హానికరం: మోడీ
మంగళవారం 28వ జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పలు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. లబ్ధి చేకూరుతుందన్న విషయాల్లోనే మానవ హక్కులు గుర్తుకువస్తాయని.. ఆ తర్వాత గుర్తుకు రావంటూ ప్రధాని మోడీ చురకలంటించారు. కొంతమంది మానవ హక్కుల పేరుతో దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అలాంటి వారిపట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ రంగుతో మానవ హక్కులను చూడకూడదని.. అది ప్రజా స్వామ్యానికి హానికరమంటూ స్పష్టం చేశారు.
హక్కులతోపాటు విధులు కూడా.. లేదంటే ప్రజాస్వామ్యానికి హానికరం
హక్కులు, విధుల అంశాలపై అవగాహన కల్పించాలని, ఈ రెండింటినీ వేరువేరుగా చూడకూడదంటూ మోడీ అభిప్రాయపడ్డారు. హక్కులతోపాటు.. విధుల పట్ల కూడా ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మోడీ సూచించారు. కొన్ని ఘటనల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు భావిస్తారని, కానీ అలాంటి ఇతర ఘటనల్లో మాత్రం వాళ్ల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయన్నారు. రాజకీయ కోణంలో చూస్తేనే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు అవుతుందని, ప్రజాస్వామ్యానికి ఇది హానికరమని మోడీ అభిప్రాయపడ్డారు.
మహిళల హక్కుల కోసం కట్టుబడి ఉన్నాం..: మోడీ
ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు కొన్ని దశాబ్ధాలుగా చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారని ప్రధాని గుర్తుచేశారు. అలాంటి వారందరికీ.. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తెచ్చి వారికి కొత్త హక్కుల్ని కల్పించామని, హజ్ సమయంలో మహ్రమ్ (మగ తోడు) నిబంధన నుంచి విముక్తి కల్పించినట్లు ప్రధాని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. పది కోట్ల మంది మహిళలకు మరుగుదొడ్డు ఏర్పాటు చేశామని ప్రధాని పేర్కొన్నారు. 4 కోట్ల ఇళ్లకు విద్యుత్తు సరఫరా కల్పించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఉద్యోగం చేస్తున్న గర్భిణి మహిళలకు 26 వారాల మెటర్నిటీ లీవ్‌ను కల్పిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. మహిళల రక్షణ కోసం 700 జిల్లాల్లో వన్‌స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 650 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. అత్యాచారం లాంటి హేయమైన నేరాలకు కఠిన శిక్షలు విధిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
Recommended Video
రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడే భారత్ ముందుకు: ప్రధాని మోడీ
సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ సబ్‌కా ప్రయాస్ లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి మానవ హక్కుల్ని రక్షించే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏదైనా పథకం ప్రవేశపెడితే.. దాని ద్వారా కొందరికే లబ్ధి చేకూరుతుందని హక్కుల అంశం బయటకు వస్తుందంటూ మోడీ వ్యాఖ్యానించారు. అందుకే అందరికీ సంక్షేమ పథకాలు అందేలా ముందుకు సాగుతున్నామన్నారు. మన రాజ్యాంగం సమానత్వ అంశంపై ప్రపంచానికి కొత్త నిర్వచనాన్ని నేర్పిందన్నారు. గత కొన్ని దశాబ్ధాలుగా కొన్ని దేశాలు తమ రాజ్యాంగ లక్ష్యాల నుంచి దారిమళ్లాయని, కానీ, భారత్ మాత్రం రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో పేదల ప్రజలందరికీ ఉచితంగా ఆహారధాన్యాలను అందిస్తున్నామని ప్రధాని తెలిపారు. కరోనా కట్టిడికి అన్ని చర్యలు తీసుకుంటూనే.. కరోనా వ్యాక్సిన్ కూడా ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications