ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడి కొడుకుపై నడిరోడ్డులో హత్యాయత్నం, అదే కారణం !

శ్యాండిల్ వుడ్ ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు జగ్గేష్ కుమారుడు గురురాజ్ మీద సోమవారం ఉదయం హత్యాయత్నం జరిగింది.

బెంగళూరు: శ్యాండిల్ వుడ్ ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు జగ్గేష్ కుమారుడు గురురాజ్ మీద సోమవారం ఉదయం హత్యాయత్నం జరిగింది. నడి రోడ్డులో గురురాజ్ మీద కత్తితో దాడి చేసిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారని బెంగుళూరులోని ఆర్ టీ నగర్ పోలీసులు చెప్పారు.

సోమవారం ఉాదయం గురురాజ్ తన కుమారుడిని స్కూల్ లో వదిలిపెట్టడానికి బెంగళూరులోని ఆర్ టీ నగర్ లోకి వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గురురాజ్ తో గొడవపెట్టుకున్నారని సమాచారం. ఆ సందర్బంలో నిందితులు కత్తి తీసుకుని గురురాజ్ ఎడమ కాలి తొడ మీద దాడి చేసి పరారైనారు.

Some strange people attacked on Kannada film actor Jaggesh's son in Bengaluru

వెంటనే ఆర్ టీ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురురాజ్ ను చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రముఖ నటుడు జగ్గేష్ ఆర్ టీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత కారణాల వలన గురురాజ్ మీద హత్యాయత్నం జరగలేదని, ట్రాఫిక్ విషయంలో గొడవ పడిన సందర్బంలో నిందితులు కత్తితో దాడి చేసి పారిపోయారని జగ్గేష్ ఫిర్యాదు చేశారని, నిందితుల కోసం గాలిస్తున్నామని ఆర్ టీ నగర్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+