సోదరి పెళ్లి, ఆస్తి గొడవ: హైకోర్టులోనే తండ్రిని నరికిన కొడుకు

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాజధాని మద్రాసు హైకోర్టులో మంగళవారం నాడు దారుణం జరిగింది. అత్యంత పటిష్టమైన భద్రత ఉండగానే, హైకోర్టు ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చిన ఓ తనయుడు తన తండ్రిని నరికి హత్యాయత్నం చేసిన సంఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది.

మణిమారన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తుంటాడు. అతనికి ఓ కొడుకు ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం కుమారుడితో విభేదాలు వచ్చాయి. గత కొంత కాలంగా వారి మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టులో ఉన్న మణిమారన్ చాంబర్ నుంచి బయటకు రాగానే.. ఆయన కొడుకు తన స్నేహితులతో కలిసి లోపలకు ప్రవేశించి కత్తితో పొడిచాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు మణిమారన్ కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Son hacks lawyer father on Madras High Court premises

మణిమారన్‌ను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన మణిమారన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా, తండ్రిని చంపిన ఆ కొడుకు పేరు రాజేష్ అని తెలుస్తోంది.

ఎందుకంటే...

మణిమారన్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఓ కూతురు, కొడుకు ఉన్నాడు. ఆ కొడుకే రాజేష్. మొదటి భార్య కూతురుకు పెళ్లి చేసేందుకు మణిమారన్ మ్యాచులు చూడటం లేదని రాజేష్ ఆరోపిస్తున్నాడు. అదే సమయంలో ఆస్తుల తగాదా కూడా ఉందని చెబుతున్నారు. దీంతో, హత్య చేయాలనుకున్నట్లు చెబుతున్నారు.

ఘటన జరిగినప్పుడు కోర్టు ప్రాంగణంలో పదుల సంఖ్యలో లాయర్లు ఉన్నారు. వారందర్నీ రాజేష్ తోసుకుంటూ తండ్రి వద్దకు వెళ్లాడు. తండ్రి పైన కత్తితో దాడి చేసిన అనంతరం అతనిని మిగతా లాయర్లు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In another shocking incident since Swathi's murder in Nungambakkam railway station, an advocate was hacked inside his chamber at Madras High Court premises on Tuesday morning, sending shockwaves inside the court campus that is under CISF security cover.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి