మరో మహిళతో తండ్రి, చంపేస్తాడనే: హైకోర్టులో తండ్రిని నరికిన కొడుకు

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తన తండ్రి తనను చంపేస్తాడనే భయంతోనే తాను హత్య చేశానని మద్రాస్ హైకోర్టు ఘటన నిందితుడు రాజేష్ చెప్పాడు. అందరు చూస్తుండగానే హైకోర్టు ప్రాంగణంలో రాజేష్ తన తండ్రి మణి మారన్ పైన కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

రాజేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని విచారించారు. రాజేష్ తండ్రి వద్దే క్లర్క్‌గా పని చేస్తున్నాడు. అతను బీకాం పూర్తి చేశాడు. తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ కారణంతో ఇంటికి రావడమే మానేశాడు.

Also Read: సోదరి పెళ్లి, ఆస్తి గొడవ: హైకోర్టులోనే తండ్రిని నరికిన కొడుకు

r father on Madras High Court premises

అదే సమయంలో రాజేష్ చెల్లి పెళ్లి ఆలస్యం అవుతోంది. దీని పైన తండ్రి, కొడుకుల మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. తరుచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. రాజేష్ మాట్లాడుతూ.. తన తండ్రికి రౌడీలతో సంబంధాలు ఉన్నాయని, వాళ్ల సాయంతో తనను చంపేస్తాడేమోనని భయపడి, నన్ను నేను రక్షించుకునేందుకు దాడి చేశానని చెప్పాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Son knifes lawyer father on Madras High Court premises.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి