ఆస్తి కోసం ఆశతో ఫాం హౌస్ లో తల్లిదండ్రులు, అక్క దారుణ హత్య, ధీమాగా పోలీస్ స్టేషన్ లో !

బెంగళూరు: ఆస్తి కోసం ఆశపడిన కొడుకు సొంత తల్లిదండ్రులతో పాటు అక్కను అతి దారుణంగా హత్య చేశాడు. వయసు మీద పడి ఆస్తి రాసివ్వడానికి నిరాకరించిన తల్లిదండ్రులను కొడవలితో అతి దారుణంగా హత్య చేశాడు. ఆ సమయంలో అడ్డు వచ్చిన అక్కను కూడా కిరాతకుడు అంతం చేశాడు. కర్ణాటక- మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దులో ఒకే కుటుంబంలో ముగ్గురు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. తరువాత ధీమాగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన కొడుకు మూడు హత్యలు చేసిన కిల్లర్ నేనే అంటూ లొంగిపోయాడు.

ఫాం హౌస్ లో ఫ్యామిలీ

ఫాం హౌస్ లో ఫ్యామిలీ

మహారాష్ట్రలోని సాంగలి జిల్లా జత్త తాలుకాలోని ఉమది ప్రాంతంలోని ఫాం హౌస్ లో గురులింగప్ప (82), నాగవ్వ అరకేరి (75) అనే వృద్ద దంపతులు నివాసం ఉంటున్నారు. గురులింగప్ప, నాగవ్వ అరకేరి దంపతులకు సముద్రా బాయి (58) అనే కుమార్తె, సిద్దప్ప అరకేరి అనే కుమారుడు ఉన్నారు. గురులింగప్ప, నాగవ్వ అరకేరి దంపతులు కుమార్తె, కుమారుడితో కలిసి ఫాం హౌస్ లో నివాసం ఉంటున్నారు.

వృద్ద దంపతుల పేరుతో ఆస్తి !

వృద్ద దంపతుల పేరుతో ఆస్తి !

గురులింగప్ప, నాగవ్వ అరకేరి దంపతులకు ఫాం హౌస్ తో పాటు అనేక ఆస్తులు ఉన్నాయి. తాము మరణించిన తరువాత ఆస్తిని మీరు పంచుకోవాలని గురులింగప్ప, నాగవ్వ అరకేరి దంపతులు కుమారుడు సిద్దప్ప అరకేరికి చెప్పారు. అయితే ఇప్పుడే తనకు ఆస్తులు భాగం పెట్టాలని చాల కాలంగా సిద్దప్ప గొడవ చేస్తున్నాడు.

ఆస్తి ఇవ్వకపోతే మీరు క్లోజ్ !

ఆస్తి ఇవ్వకపోతే మీరు క్లోజ్ !

కాటికి కాలు చాపిన మీరు మీ పేరుతో ఆస్తులు పెట్టుకుని ఏం చేస్తారని, తన పేరు మీద ఆస్తులు రాసివ్వాలని గురులింగప్ప, నాగవ్వ అరకేరి దంపతుల మీద అతని కుమారుడు ఒత్తిడి చేశాడు. అయితే ఎలాంటి పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతున్న సిద్దప్ప పేరుతో ఆస్తి రాసివ్వడానికి గురులింగప్ప, నాగవ్వ అరకేరి దంపతులు అంగీకరించలేదు. ఆస్తి తన పేరుతో రాసివ్వకుంటే మిమ్మల్ని చంపేస్తానని సిద్దప్ప చాలా సార్లు అతని తల్లిదండ్రులను హెచ్చరించాడు.

కొడవలితో తల్లిదండ్రులపై దాడి

కొడవలితో తల్లిదండ్రులపై దాడి

ఆస్తి ఇవ్వకుంటే చంపేస్తానని పదేపదే సిద్దప్ప బెదిరించినా అతని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. గురువారం రాత్రి ఫాం హౌస్ లోని ఇంటిలో గురులింగప్ప, నాగవ్వ అరకేరి దంపతుల మీద అతని కుమారుడు సిద్దప్ప కొడవలితో ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. విషయం గుర్తించిన సముద్రాబాయి సోదరుడు సిద్దప్పను అడ్డుకోవడానికి ప్రయత్నించింది.

ధీమాగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి !

ధీమాగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి !

తల్లిదండ్రుల మీద దాడి చేస్తున్న సమయంలో సోదరి సముద్రా బాయి మీద సిద్దప్ప కొడవలితో దాడి చేశాడు. ముగ్గురిని దారుణంగా హత్య చేసిన సిద్దప్ప ఎలాంటి ఫీలింగ్ లేకుండా అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు. తన తల్లిదండ్రులతో పాటు అక్కను తానే హత్య చేశానని సిద్దప్ప పోలీసుల ముందు అంగీకరించాడు. ఆస్తి కోసం కన్న కొడుకు చేతిలో వృద్ద దంపతులు, ఆమె కుమార్తె దారుణ హత్యకు గురి కావడంతో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+