ఢిల్లీ వీడి వెళ్లాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వైద్యుల సూచన.. కారణం ఇదే !!

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ భారతదేశ రాజధాని ఢిల్లీని వదిలి బయటకు వెళ్లాలని వైద్య నిపుణులు సూచించినట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొద్దిరోజుల పాటు చెన్నై కి గాని గోవాకి గాని వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా సోనియాగాంధీ చాతి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న నేపథ్యంలో వైద్యులు ఆమెను ఢిల్లీ నగరాన్ని కొద్దిరోజుల పాటు వదిలి వెళ్లాలని సూచించినట్లుగా సమాచారం.

నేడు సోనియా గాంధీ మధ్యాహ్నం ఢిల్లీని వదిలి బయలుదేరే అవకాశం ఉందని, వీరితో పాటు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వాద్రా కూడా వెళ్తారని తెలుస్తుంది. ఛాతిలో నొప్పి కారణంగా సోనియాగాంధీ జూలై 30వ తేదీన గంగారాం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ఆమెడిశ్చార్జ్ అయినప్పటి నుండి సోనియాగాంధీ వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటున్నారు . సెప్టెంబర్ మాసంలో ఆమె సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్లి వచ్చారు.

Sonia Gandhi advised to shift out of Delhi for few days in view of her chronic chest infection

సోనియా గాంధీ అనారోగ్యం పూర్తిగా నయం కాకపోవడంతో ఆమె ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటున్నారు. ఢిల్లీ కాలుష్యం కారణంగా సోనియా గాంధీకి చాతి ఇన్ఫెక్షన్ క్రమంగా పెరిగే అవకాశముందని , ఉబ్బసం ఎక్కువయ్యే అవకాశం ఉందని వైద్యులు సూచించడంతో వైద్యుల సూచనల మేరకు సోనియా గాంధీ గోవా లేదా చెన్నైకి వెళతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల బిహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత పార్టీపై దృష్టి సారించాలని, ప్రక్షాళన జరగాలని సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన తరుణంలో సోనియాగాంధీ ప్రస్తుతం ఢిల్లీ వీడి వెళ్లనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+