Opposition Meet : విపక్షాల కూటమి ఛైర్ పర్సన్ గా సోనియా ? కన్వీనర్ గా నితీష్ కుమార్ ?
కర్నాటక రాజధాని బెంగళూరులో 26 విపక్ష పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న రెండో సమావేశం నిన్న ప్రారంభమైంది. రెండు రోజుల పాటు సాగే ఈ భేటీలో ఇవాళ రెండోరోజు విపక్ష నేతలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా విపక్ష కూటమిని నడిపించే బాధ్యతలు ఎవరికి అప్పగించాలి, అలాగే విపక్షాల్ని సమన్వయం చేసే బాధ్యత ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీకి మరోసారి విపక్ష కూటమి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విపక్ష కూటమిలోని మెజార్టీ పార్టీలు ఇందుకు మొగ్గు చూపవచ్చనే సమాచారం అందుతోంది. అలాగే విపక్ష కూటమికి కన్వీనర్ గా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను ఆయా పార్టీలు ఎంచుకోవచ్చని తెలుస్తోంది. వీరిద్దరి ఎంపికలతో పాటు కూటమి పేరును కూడా ఇవాళ నిర్ణయించబోతున్నారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

నిన్న రోజంతా బెంగళూరులో సమావేశమైన విపక్ష నేతలు సాయంత్రం విందు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఇవాళ్టి చర్చల ఎజెండాను లాంఛనంగా ఖరారు చేశారు. యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సోనియా గాంధీని తాజా విపక్ష ఫ్రంట్ అధ్యక్షురాలిగా, నితీష్ కుమార్ కన్వీనర్‌గా ఎంపికయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇవాళ జరిగే రెండోరోజు భేటీలో సోనియాగాంధీతో పాటు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ పాల్గొంటున్నారు. అలాగే నిన్నటి భేటీకి హాజరు కాని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఇవాళ హాజరయ్యే అవకాశం ఉంది.
మరోవైపు విపక్ష ఫ్రంట్ పేరును సూచించాల్సిందిగా అన్ని పార్టీలను కోరామని, అందులో 'ఇండియా' అనే పదం ఉండాల్సిందేనని పలు పార్టీలు కోరుతున్నట్లు తెలుస్తోంది. "యునైటెడ్ వి స్టాండ్" అనే ట్యాగ్ లైన్ కూడా ఉంచాలని కోరుతున్నారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కోసం సూచనలు కూడా ఇవ్వాలని విపక్ష పార్టీల్ని కోరినట్లు తెలుస్తోంది. ఇందులో రాష్ట్రాల సమస్యలను ప్రత్యేకంగా ఉంచాలని కూడా సూచించారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications