వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విపక్షాలతో సోనియా గాంధీ కీలక భేటీ-ఎంపీల సస్పెన్షన్ పై చర్చ మమతకు అందని ఆహ్వానం

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ సాయంత్రం విపక్ష పార్టీల నేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్బంగా కేంద్రం విపక్షాల్ని పరిగణనలోకి తీసుకోకుండా తీసుకుంటున్న పలు నిర్ణయాలపై ఆమె వారితో చర్చించారు. ఈ కీలక భేటీకి మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు మాత్రం ఆహ్వానం అందలేదు.

రాజ్యసభలో దుష్ప్రవర్తన పేరుతో 12 మంది ఎంపీల్ని సస్పెండ్ చేసిన ఛైర్మన్ వెంకయ్య నాయుడు వారిని తిరిగి రానిచ్చేందుకు ససేమిరా అంటున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై విపక్షాలు చర్చించాయి. వాస్తవానికి వెంకయ్య సస్పెండ్ చేసిన ఎంపీల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ ను కూడా ఈ భేటీకి ఆహ్వానిస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. యూపీఏ ఎక్కడుందంటూ మమతా బెనర్జీ తాజాగా వేసిన ప్రశ్నతో సోనియాగాంధీకి ఆమెకూ మధ్య దూరం పెరిగింది. దీంతో ఈ సమావేశానికి తృణమూల్ కు ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది.

sonia gandhi hold opposition meet without invitation to mamata banerjees trinamool congress

పార్లమెంటులో ప్రతిష్టంభనకు దారితీసిన 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయడంపై ముందుకు వెళ్లే మార్గాన్ని రూపొందించడానికి ఈ సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీ నివాసంలో వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌తో పాటు, ఐదు ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు శరద్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకె, శివసేన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయని వర్గాలు తెలిపాయి.
పవార్, సేన నాయకుడు సంజయ్ రౌత్, డిఎంకె టిఆర్ బాలు, సిపిఎం సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఈ సమావేశానికి హాజరయ్యారని, అక్కడ రాహుల్ గాంధీ కూడా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఈ అంశంపై ముందుకు వెళ్లేందుకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుతో మాట్లాడాలని శరద్ పవార్‌ను నేతలు కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్యసభ సజావుగా సాగాల్సిన ఆవశ్యకతను వెంకయ్య విపక్షాలకు తెలిపారు. అలాగే సస్పెండైన ఎంపీల వ్యవహారంపై చర్చించాల్సిందిగా సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిని కూడా కోరారు.

English summary
congress president sonia gandhi on today evening holds meeting with opposition parties without trinamool congress
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X