విమానం అత్యవసర ల్యాండ్, సోనియా గంట వెయిటింగ్

లక్నో: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం గురువారం సాయంత్రం ఉత్తర ప్రదేశ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వాతావరణం బాగా లేనందున ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో విమానం ల్యాండ్ అయింది. సమాచారం మేరకు.. న్యూఢిల్లీలో భారీగా ఈదురు గాలులు వీస్తుండటం, వాతావరణం సరిగా లేకపోవడంతో సోనియా ప్రయాణిస్తున్న విమానాన్ని ఆగ్రా వైపు మళ్లించారు.

ఆగ్రా ఖెరియా విమానాశ్రయంలో దింపాల్సి వచ్చింది. ఈ నెల 12వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లో చివరి విడత ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. పలు సభలలో ప్రసంగించిన సోనియా గాంధీ న్యూఢిల్లీ పయనమయ్యారు.

Sonia Gandhi’s plane makes emergency landing in Agra due to bad weather

వాతావరణం అనూకూలంగా లేకపోవడంతో ఆగ్రాలో దింపారు. సోనియా గాంధీ గంటకు పైగా విమానాశ్రయంలోని విఐపి లాంజ్‌లో నిరీక్షించారు. ఢిల్లీలో వాతావరణం క్లియర్ అయిందని సమాచారం వచ్చే వరకు ఆమె అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఖేరా విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి అదే విమానాశ్రయంలో వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+