సోనియాలాగా రాహుల్ కూడా రోజూ ఆఫీస్‌కు రావాలి: షీలా దీక్షిత్, మరి రాహుల్ ఏమంటారో?
రాహుల్‌గాంధీ కూడా తన తల్లి సోనియాగాంధీ మాదిరిగానే ప్రతి రోజూ ఉదయం పార్టీ ప్రధాన కార్యాలయానికి రావాలని పార్టీ సీనియర్ నేత షీలాదీక్షిత్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాంక్ష వెలిబుచ్చారు.
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ కూడా తన తల్లి సోనియాగాంధీ మాదిరిగానే ప్రతి రోజూ ఉదయం పార్టీ ప్రధాన కార్యాలయానికి రావాలని పార్టీ సీనియర్ నేత షీలాదీక్షిత్ ఆకాంక్ష వెలిబుచ్చారు.
సోనియా గాంధీ రోజూ కార్యాలయంలో రెండు నుంచి మూడు గంటల పాటు ఉండేవారని రాహుల్ కూడా అలాగే కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యకలాపాల విషయంలో మరింత శ్రద్ధ వహించాలని ఆమె పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్థానంలోకి ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రానున్నారనే వూహాగానాల నేపథ్యంలో షీలా దీక్షిత్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీ కార్యకర్తలు, నేతలతో రాహుల్ మరింత మమేకం కావాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలు అయిన సమయంలో అలాగే చేశారని, రాహుల్ కూడా అదే అనుసరించాలని.. అప్పుడు తప్పకుండా తిరిగి కాంగ్రెస్ కార్యాలయంలో సందడి నెలకొంటుందని షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు.
రాహుల్‌లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తిరిగి మంచి రోజులు వస్తాయని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. షీలా దీక్షిత్ ఆకాంక్ష అయితే బాగానే ఉంది కానీ, మరి రాహుల్ ఏమంటారో?
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications