రాహుల్, సోనియా రాజీనామాలు: కాంగ్రెసు నో
న్యూఢిల్లీ: తమ పదవులకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాలు సమర్పించారు. వారి రాజీనామాలను కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) తిరస్కరించింది. తాము రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తామని ఆస్కార్ ఫెర్నాండెజ్ చెప్పారు. సోనియా, రాహుల్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ సిడబ్ల్యుసి తీర్మానం చేసింది. సిడబ్య్లుసిలో మార్పులు చేర్పులు చేసే విషయంలో అంతిమ నిర్ణయం సోనియాదేనని రాజబబ్బర్ అన్నారు.
దేశంలోని 11 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెసు గెలుచుకోలేకపోయింది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో కాంగ్రెసు లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సోనియా నివాసంలో సిడబ్ల్యుసి సమావేశం జరిగింది. మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించినట్లు తెలుస్తోది.

రాజీనామాలు చేయడానికి సోనియా, రాహుల్ ముందుకు వచ్చారు. అయితే, సిడబ్ల్యుసి ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. సిడబ్ల్యుసి సమావేశం ప్రారంభమయ్యే ముందు కొంత మంది యువకులు రాహుల్ గాంధీ అనుకూల నినాదాలు చేశారు.
కాంగ్రెసు 543 లోకసభ స్థానాల్లో 43 మాత్రమే దక్కించుకుని, ప్రతిపక్ష హోదాను కూడా పొందలేని స్థితికి వచ్చింది. ఆర్థిక మాంద్యం, ధరల పెరుగుదల, అవినీతి కుంభకోణాలు పరాజయానికి కారణాలుగా చెప్పుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications