సోనూ సూద్ కార్ సీజ్ - నో ఎంట్రీ : ఈసీ ఆంక్షలు -ఓట్ల కొనుగోలుకు ప్రయత్నాలు..!!
పంజాబ్ ఎన్నికల్లో భాగంగా ఓటర్లు భారీగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద సందడి కనిపిస్తోంది. ప్రముఖులు పలువురు ఓట్లు వేసారు. మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల కు ఒకే విడతలో ఈ రోజు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అయితే, ప్రముఖ నటుడు సోనూసూద్ ను మోగా శాసనసభ నియోజకవర్గ పరిధిలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన పైన ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై మావికా సూద్ పోటీ చేస్తున్నారు. ఆమె సోనూ సూద్ సోదరి.
Recommended Video
ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదు
ఆయన ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని శిరోమణి అకాలీ దళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్ మద్దతుదారు ఒకరు ఫిర్యాదు చేశారు.దీంతో.. మోగా శాసన సభ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించేందుకు వెళ్తున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను పోలింగ్ కేంద్రాలకు వెళ్ళవద్దని ఆదేశించింది. ఆయన కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఓట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారంటూ
ఈ ఆరోపణలను సోనూ ఖండించారు. తాను స్థానికుడినని, తాను కేవలం పోలింగ్ కేంద్రాల బయట కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బూత్‌ల వద్దకు మాత్రమే వెళ్ళానని చెప్పారు. ఇతర అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని ఓ ట్వీట్‌లో ఆరోపించారు. ఈ ట్వీట్‌ను మోగా ప్రజా సంబంధాల అధికారికి, పోలీసులకు ట్యాగ్ చేశారు. మోగా నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల సందర్శనకు వెళ్ళకుండా నిరోధించేందుకు సోనూ సూద్ కారును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.
కారు సీజ్.. నివేదిక కోరిన అధికారులు
సోనూ సూద్ ఓటర్ల ను ప్రభావితం చేసే ప్రయత్నం చేసారా అనే కోణం లో నివేదిక కోసం మోగా ఎస్ఎస్‌పీని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ నయ్యర్ చెప్పారు. ఆయన ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరొక పోలింగ్ స్టేషన్‌కు వెళ్తున్నారని, దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయని వెల్లడించారు. పంజాబ్ లో మధ్నాహ్నం 1 గంట వరకు 30 శాతం పోలింగ్ నమోదైంది. జలంధర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ 20-30 సీట్ల కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications