సోనూసూద్‌కు కరోనా.. క్వారంటైన్‌లో ఉన్నానని ట్వీట్, నేనున్నా అంటూ
కరోనా మహమ్మరి దావానంలా విస్తరిస్తోంది. ఎవరినీ వదలడం లేదు. తనకు కరోనా సోకిందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ నటుడు సోనూసూద్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కానీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Recommended Video
ట్వీట్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సోనూసూద్ పోస్ట్ చేశారు. హిందీతోపాటు ఇంగ్లీష్‌లో కూడా విషయం రాశారు. తాను ఇప్పుడు క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు. తాను ఇప్పుడు కష్టంలో ఉన్నానని.. త్వరలో కోలుకుంటానని చెప్పారు. అయినప్పటికీ ఏదైనా కష్టం ఉంటే చెప్పాలని.. మీ వెన్నంటే ఉంటానని వివరించారు.

సోనూసూద్ నటుడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రల్లో మెప్పించారు. కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో మాత్రం ఆయన అందరీ మనసులను దోచుకున్నారు. ఆపదలో ఉన్నవారికి అన్నం పెట్టారు. చిత్తూరు రైతుకు ట్రాక్టర్ అందజేశారు. వరంగల్ వనితకు సాప్ట్ వేర్ ఉద్యోగం ఇప్పించారు. ఆపదలో ఉన్నానని తెలిస్తే చాలు నేనున్నానంటూ ముందుకు వచ్చారు.

లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన సేవలకు రూ.20 కోట్ల వరకు కరగిపోయాయని తెలుస్తోంది. మిగతా వారు చేయని సాయం.. సోనూసూద్ చేసి మంచిపేరు సంపాదించుకున్నారు.












Click it and Unblock the Notifications