మోడీ దెబ్బ: కాంగ్రెస్ మంత్రి మళ్లీ రిసార్ట్ రాజకీయాలు, మౌనవ్రతంలో స్వామిజీ, వెనక్కి తగ్గను !

బెంగళూరు: ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కాస్తా ఊపిరిపీల్చుకుని ఇప్పుడు మళ్లీ రాజకీయాలు మొదలుపెట్టారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులతో కలిసి మళ్లీ రిసార్ట్ రాజకీయాలు చేస్తున్నారు.

శనివారం ఐటీ దాడులు పూర్తి అయిన వెంటనే మంత్రి డీకే. శివకుమార్ బెంగళూరు నగరంలోని విజయనగరలోని కాడు సిద్దేశ్వర సంస్థానం నడువినికెరె మఠం మఠాధిపతి అజ్జయ్య ఆశీర్వాదం తీసుకోవాలని వెళ్లారు. అయితే మఠాధిపతి అజ్జయ్య చంద్రగ్రహణం వరకు మౌనం వ్రతం చెయ్యడంతో ఆశీర్వాదం తీసుకోవడానికి అవకాశం లేకపోయింది.

Soon after Income Tax raid completes, Karnataka Power Minister D K Shivakumar back in action.

అజ్జయ్య ముందు మౌనంగా నిలుచుకున్న మంత్రి డీకే. శివకుమార్ ఆయన ఆశీర్వాదం తీసుకుని వచ్చారు. తరువాత రాజ్ భవన్ చేరకుని అక్కడ ఉన్న గుజరాత్ కాంగ్రెస్ శాసన సభ్యులతో కలిసి బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలోని ఈగల్టన్ రిసార్ట్ కు వెళ్లిపోయారు. కనకపురలో కబ్బాళమ్మ దేవాలయంలో డీకే. శివకుమార్ తల్లి గౌరమ్మ ప్రత్యేక పూజలు చేయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+