శుభవార్త: ఈపిఎఫ్ నుండి 90 శాతం నిధులు డ్రా చేసుకొండిలా, కష్టాలు తీరేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఈపిఎఫ్ నుండి 90 శాతం నిధులను గృహనిర్మాణాల కోసం ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లోక్ సభలో ప్రకటించారు.

ఈఫిఎప్ స్కీమ్ లో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుదవారం నాడు లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సమాధానమిచ్చారు.

కొత్త పథకాన్ని సభ్యుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తెస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కొత్త పథకం పలువురు సభ్యులకు ప్రయోజనంగా ఉండే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించింది.

గతంలో ఆయా సంస్థలను వదిలి వెళ్ళే సమయంలోనో, రిటైరయ్యే సమయంలోనో మొత్తం నిధులను డ్రా చేసుకొనే వెసులుబాటు ఉండేది.అయితే ప్రస్తుతం గృహ నిర్మాణ అవసరాల కోసం 90 శాతం నిధులను డ్రా చేసుకొనే వీలును కల్పిస్తోంది కేంద్రం.

గృహల నిర్మాణాలకు 90 శాతం ఈఫిఎఫ్ నిధులు

గృహల నిర్మాణాలకు 90 శాతం ఈఫిఎఫ్ నిధులు

కేంద్ర ప్రభుత్వం ఈఫిఎప్ నిధులను ఒకేసారి డ్రా చేసుకొనేలా చట్ట సవరణ తీసుకురానుంది. తమ ఖాతాలోని నిధుల్లో సుమారు 90 శాతం నిధులను ఒకేసారి డ్రా చేసుకొనే వెసులుబాటును కల్పిస్తోంది.అయితే గృహ నిర్మాణానికి, లేదా కొత్త ఇళ్ళు, లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం ఈ నిదులను వాడుకోవాల్సి ఉంటుంది.

నెలవారీ వాయిదాలు చెల్లించే వెసులుబాటు

నెలవారీ వాయిదాలు చెల్లించే వెసులుబాటు

ఈఫిఎప్ నుండి 90 శాతం నిధులను ఇళ్ళు లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం డ్రా చేస్తే ప్రతి నెలా వాయిదాల పద్దతిలో ఈ నిధులను చెల్లించే వెసులుబాటును కూడ తీసుకురానుంది.అయితే ఈ మేరకు చట్టంలో సవరణలు తెస్తే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్రం చెబుతోంది.

పది మంది సోసైటీగా ఏర్పడితే నిధులిలా

పది మంది సోసైటీగా ఏర్పడితే నిధులిలా

పదిమంది సభ్యులు కోఆపరేటివ్ సోసైటీగా ఏర్పాటు కావాలి. ఈ సోసైటీ సభ్యులు తమ అవసరాల నిమిత్తం తమ ఖాతాల్లోని నిధులను 90 శాతం డ్రా చేసుకొనే అవకాశం ఉంది. అయితే పదిమంది సభ్యులు మాత్రం కోఆపరేటివ్ సోసైటీని నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ సోసైటీ రిజిస్ట్రేషన్ చేసుకొంటే తప్ప నిధుల డ్రా చేసుకోలేమని కేంద్రం ప్రకటించింది.

స్వల్ప సవరణలతో ప్రయోజనాలు

స్వల్ప సవరణలతో ప్రయోజనాలు

కేంద్ర ప్రభుత్వం ఈఫిఎప్ లో కొన్ని సవరణలను ప్రతిపాదిస్గున్నట్టుగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. ఈపిఎప్ పథకం 1952 లో 68 బిడి అనే కొత్త పేరాగ్రాఫ్ ను చేర్చనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ప్రకటించారు.కొత్త ఈఫిఎప్ నిబంధనల ప్రకారంగా కోఆపరేటివ్ సోసైటీ లేదా హౌజింగ్ సోసైటీల్లో పదిమంది సభ్యులుగా ఉంటే చాలు 90 శాతం నిధులను డ్రా చేసుకొనే వెసులుబాట ఉంటుంది.

ఈపిఎప్ సభ్యులు 17.14 కోట్లు

ఈపిఎప్ సభ్యులు 17.14 కోట్లు

2016 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా 17.14 కోట్ల మంది ఈపిఎప్ సభ్యులు ఉన్నారని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పార్లమెంట్ కు చెప్పారు. 2015 16 సంవత్సరానికి గాను సుమారు 3.76 కోట్లమంది సభ్యులు నిధులను పొందారని చెప్పారు. అయితే పిఎప్ నిర్ధేశించిన నిబంధనలను పూర్తి చేసినవారికే పిఎప్ ఖాతాల నుండి డబ్బులు డ్రా చేసుకొనే సౌకర్యం ఉండేదని ఆయన గుర్తు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Government will amend EPF scheme to enable around 4 crore members of retirement fund body EPFO to withdraw up to 90 per cent of their fund for making down payments while buying homes, Parliament was informed on Wednesday.
Please Wait while comments are loading...