షాక్: శశికళ దెబ్బ, ఆమె బంధువులు మొత్తం ఇప్పుడు వీవీఐపీలే !

చెన్నై: చెన్నైలోని మెరీనా బీచ్ తీరంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని మహాత్మగాంధీ విగ్రహం సమీపంలో గురువారం ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జాతీయపతాకాన్ని ఎగరవేస్తున్నారు.

గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గోన్నడానికి అన్నాడీఎంకే చీఫ్ చిన్నమ్మ శశికళ బంధువర్గానికి వీవీఐపీ పాస్ లు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది. శశికళ ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Sources said that TamilNadu govt. yet to give VVIP passes to Sasikala Natarajan's relatives.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తదితర ప్రముఖులకు ఇచ్చే వీవీఐపీ పాస్ లు ఇప్పుడు శశికళ బంధువులకు ఇస్తున్నారని వెలుగు చూడటంతో అన్నాడీఎంకే పార్టీలోని ఓ వర్గం నాయకులు మండిపడుతున్నారు.

పన్నీర్ సెల్వంకు లక్కీచాన్స్ !

సాధారణంగా గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్ర గవర్నర్ జాతీయపతాకాన్ని ఎగరవేయడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం తమిళనాడుకు ఇన్ చార్జ్ గవర్నర్ గా ఉన్న సీహెచ్. విద్యాసాగర్ రావు మహారాష్ట్రకు శాశ్వత గవర్నర్ గా పని చేస్తున్నారు.

ముంబైలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యాసాగర్ రావు జాతీయపతాకాన్ని ఎగరవేయనున్నారు. అయితే ఊహించని రీతిలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు గణతంత్ర దినోత్సవం వేడుకల్లో జాతీయపతాకాన్ని ఎగరవేసే అవకాశం దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+