రైల్లో బెర్త్ దొరకలేదా ? మీ కోసం రేపటి నుంచే ఈ కొత్త రూల్ ..!
రైలు ప్రయాణికులు రెగ్యులర్ గా ఎదుర్కొనే సమస్యల్లో బెర్త్ దొరక్కపోవడం కూడా ఒకటి. ఏదైనా రైల్లో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత బుకింగ్ కోసం ప్రయత్నిస్తే బెర్తులు అంత ఈజీగా అందుబాటులో ఉండటం లేదు. వీటి కోసం తీవ్రమైన పోటీ ఉంటోంది. అలాగని రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయి ప్రయాణిస్తున్నాయా అంటే అదీ లేదు. దీంతో సమస్య పరిష్కారానికి రైల్వేశాఖ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా మరో కొత్త రూల్ అమలుకు సిద్దమైంది.
రేపటి నుంచి రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేసే నిబంధన అమల్లోకి తీసుకొచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్దమైంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రిజర్వేషన్ ఛార్టుల ప్రిపరేషన్లో కొత్త విధానం జులై 7 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు రైలు బయల్దేరడానికి 4 గంటల ముందే ఛార్జ్ ప్రిపేర్ అవుతుండగా, రేపటి నుంచి 8 గంటల ముందే ఛార్ట్ ప్రిపేర్ చేయనున్నారు.

ఈ లెక్కన చూస్తే మధ్యాహ్నం 2 గంటల్లోపు బయల్దేరే రైళ్ల రిజర్వేషన్ చార్టుల్ని ముందురోజు రాత్రి 9 గంటలకల్లా ప్రిపేర్ చేసి రైళ్లపై అతికిస్తారు. దీనివల్ల చివరి నిమిషంలో బెర్త్ దొరకనివారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుంటుంది. అలా కాకుండా 4 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేసి వెల్లడించడం వల్ల లాస్ట్ మినిట్ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. బెర్త్ దొరికితే సరే సరి.. లేకుంటే ఆఖరు నిమిషంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బెర్త్ దొరకని వారికి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకునేందుకు సౌలభ్యం దొరుకుతుంది.












Click it and Unblock the Notifications