ఎంపీ సీట్ల పెంపుపై దక్షిణాదివి భయాలేనా ? కేంద్రం ఏమంటోంది ? వాస్తవం ఏంటి ?
దేశవ్యాప్తంగా 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెరగబోతోంది. అయితే దీనిపై దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం జనాభా ఆధారంగా చేస్తున్న ఈ పునర్విభజన వల్ల తమకు నష్టం జరుగుతోందని, భారీగా ఆదాయం ఇస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లను ఎక్కువగా పెంచకుండా తక్కువ ఆదాయం ఇస్తున్న ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా స్పందిస్తూ దక్షిణాది ఒక్క సీటు కూడా కోల్పోదన్నారు.
పునర్విభజన ఎందుకు ? చరిత్ర ?
ప్రతీ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో తాజా జనాభా ఆధారంగా ఆయా చోట్ల నియోజకవర్గాల సరిహద్దుల్ని మార్చాలని రాజ్యాంగం చెబుతోంది. తద్వారా ప్రతీ నియోజకవర్గంలోనూ సగటు ప్రజల సంఖ్య దాదాపు ఒకేలా ఉండాలనేది దీని ఉద్దేశం.
ఇలా 1976 వరకు ప్రతి భారత జనాభా లెక్కల తర్వాత లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభల స్థానాలు దేశవ్యాప్తంగా సవరించారు. 1951, 1961, 1971 జనాభా లెక్కల ఆధారంగా ఇలా మూడుసార్లు చేశారు. ఎమర్జెన్సీ టైంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2001 జనాభా లెక్కల వరకు దేశంలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను మార్చకూడదని నిర్ణయించారు. జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని కోల్పోకుండా కుటుంబ నియంత్రణ చర్యలను అమలు చేయడానికి అలా చేశారు.

దక్షిణాదిలో భయాలు, వ్యతిరేకత
2001లో నియోజకవర్గాల సరిహద్దులు మార్చారు. కానీ ప్రతి రాష్ట్రం లోక్‌సభలో ఉన్న సీట్ల సంఖ్య, అలాగే రాష్ట్రాల శాసనసభల బలం అలాగే ఉన్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అలాగే ఆయా రాష్ట్రాలు తాజా జనాభా డేటా ఆధారంగా నియోజకవర్గాల పునర్ విభజన చేస్తే పార్లమెంట్‌లో తమ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని, తద్వారా తమ రాజకీయ బలం తగ్గుతుందని భావిస్తున్నాయి. దీంతో తమిళనాడుతో పాటు బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే గతేడాది ఏపీలో వృద్ధాప్య జనాభాపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. ఎక్కువ మంది పిల్లలను కనడానికి కుటుంబాలను ప్రోత్సహించడానికి చట్టం చేస్తామని ప్రకటించారు. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదని ప్రశ్నించారు.
ఆరెస్సెస్ భయాలు
గతేడాది జూలైలో సంఘ్ పరివార్ కూడా పశ్చిమ, దక్షిణ భారతదేశంలో తక్కువ జననాల రేటు ఈ ప్రాంతాలను ప్రతికూలంగా ఉంచినట్లు తెలిపింది. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ మ్యాగజైన్ ది ఆర్గనైజర్ తమ సంపాదకీయంలో ప్రాంతీయ అసమతుల్యత అనేది భవిష్యత్తులో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్ విభజన ప్రక్రియను ప్రభావితం చేసే మరో కీలకమైన కోణం అని తెలిపింది. జనాభా నియంత్రణ చర్యలకు సంబంధించి పశ్చిమ, దక్షిణ రాష్ట్రాలు సాపేక్షంగా మెరుగ్గా పనిచేస్తున్నాయని, అందువల్ల జనాభా గణన తర్వాత బేస్ పాపులేషన్‌ను మార్చినట్లయితే పార్లమెంటులో కొన్ని సీట్లు కోల్పోతామన్న భయాలున్నట్లు చెప్పింది.
డేటా ఏం చెబుతోంది ?
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ప్రతి రాష్ట్రం పొందే సీట్ల సంఖ్య బేస్ యావరేజ్ పాపులేషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు అందులో ప్రకటిస్తారు. ఉదాహరణకు 1977 లోక్‌సభలో దేశంలోని ప్రతి ఎంపీ సగటున 10.11 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించారు. అలాగే ఈ బేస్ యావరేజ్ ఎంత ఉండాలనే దానిపై ఎలాంటి పరిమితి లేదు. 10.11 లక్షల సగటును కొనసాగిస్తే లోక్‌సభ లో ఎంపీల సంఖ్య బలం ప్రస్తుత 543 నుండి దాదాపు 1,400కి చేరుతుందని అంచనా. దీనర్ధం ఉత్తరాఖండ్ తో కూడిన యూపీ లోక్‌సభలో 85 నుండి 250 సీట్ల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరుగుతుంది. అలాగే జార్ఖండ్ తో కూడిన బీహార్ లో సీట్ల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే తమిళనాడు వాటా 39 నుండి 76కి పెరుగుతుంది. కేరళ సీట్ల సంఖ్య 20 నుండి 36కి పెరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రాల వాటాల కంటే రెట్టింపు కంటే తక్కువ.
అలాగే కొత్త పార్లమెంటులో కేవలం 888 సీట్లు మాత్రమే ఉన్నందున, ఈ ఫార్ములాను కొనసాగదని చెప్పవచ్చు.
దక్షిణాదివి కేవలం భయాలేనా ?
ఒక్కో నియోజకవర్గం జనాభాను 20 లక్షలుగా ఉంచుకుంటే, పార్లమెంటులో ప్రస్తుతం ఉన్న 543 సీట్లు 707 సీట్లు అవుతాయి.
దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికీ గణనీయమైన ప్రతికూలతలో ఉన్నాయి. తమిళనాడు సీట్లు లాభపడదు లేదా కోల్పోదు. కేరళలో రెండు సీట్లు పోతాయి. అయితే ఉత్తరాఖండ్ తో కూడిన యూపీ లో సీట్లు 126 అవుతాయి. అలాగే జార్ఖండ్ తో కూడిన బీహార్‌లో 85 సీట్లు అవుతాయి. అలాగే ఒక్కో నియోజకవర్గ జనాభాను సగటున 15 లక్షలుగా ఉంచితే పార్లమెంట్లో 942 సీట్లు అవుతాయి. అందులో తమిళనాడు 52, కేరళలో 24 అవుతాయి. యూపీ న, బీహార్ 114 అవుతాయి. దీన్ని బట్టి చూస్తే దక్షిణాదివి భయాలే అనిపించక మానదు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications