తరలింపు: సుష్మా స్పందనకు అక్షయ్ కృతజ్ఞతలు

Subscribe to Oneindia Telugu

ముంబై: దక్షిణ సుడాన్‌లో రోజురోజుకీ ఘర్షణలు తీవ్రమవుతుండటంతో.. అక్కడ చిక్కుకున్న భారతీయులను వీలైనంత త్వరగా క్షేమంగా వెనక్కు రప్పించాలని బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌.. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

అక్షయ్ ట్వీట్‌కు సుస్మా స్వరాజ్ వెంటనే స్పందించారు. 'మీరు కంగారుపడకండి అక్షయ్‌. మనవారిని అక్కడి నుంచి క్షేమంగా భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటాం' అని రీ ట్వీట్‌ చేశారు. ఈ విషయమై ఇదివరకే దక్షిణ సుడాన్‌కు ఎవరూ వెళ్లొద్దని కేంద్రం సూచించిన విషయం తెలిసిందే.

అక్కడ ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. కాగా, సుష్మా సత్వర స్పందనకు అక్షయ్‌ వెంటనే కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలోనే వారందరినీ సురక్షితంగా తరలించిన శుభవార్త వింటానని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.

1990లో ఇరాక్ యుద్ధం నేపథ్యంలో కువైట్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ఓ ఎన్నారై పారిశ్రామికవేత్త, భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కిన 'ఎయిర్ లిఫ్ట్' అనే బాలీవుడ్ చిత్రంలో అక్షయ్ కుమార్ ఎన్నారై వ్యాపారవేత్త పాత్ర పోషించిన విషయం తెలిసిందే. సుమారు లక్షా70వేల మందిని ఈ ఆపరేషన్ ద్వారా భారత్‌కు తీసుకొచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
While there is rising concern for the safety of Indians stranded in Juba, South Sudan, External Affairs Minister Sushma Swaraj has assured that all the arrangements have been made for their evacuation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X