చురుగ్గా రుతుపవనాలు: ఏపీలో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు, ఈదురుగాలులు

అమరావతి: మూడు రోజుల ముందుగానేకేరళకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు చురుగ్గు కదులుతున్నాయి. ఇప్పటికే కేరళను దాటేసిన నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తున్నాయి. ఇవ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆ తర్వాత తెలంగాణకు వ్యాపిస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రాష్ట్రంలో వీస్తున్న పవనాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలతో ఉపశమనం కలగనుంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. బుధ, గురువారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంది.

Southwest Monsoon: next two days rains Andhra pradesh districts.

ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వానాకాలంలో సాధారణం కన్నా ఎక్కువగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముందుగా అనుకున్న దానికంటే అధికంగా వానలు పడతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. సగటున 103 శాతం వానలు పడతాయని తెలిపింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+