Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెరుగవుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం - వెంటిలేటర్, ఎక్మో కొనసాగుతోందన్న ఎంజీఎం - థ్యాంక్స్ చెప్పిన చరణ్

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొవిడ్ వ్యాధి ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్నాని, రోజురోజుకూ ఆరోగ్యం మెరుగుపడుతోందని డాక్టర్లు, కుటుంబీకులు తెలిపారు. చెన్నైలో బాలు చికిత్స పొందుతోన్న ఎంజీఎం ఆస్పత్రితోపాటు, ఆయన తనయుడు ఎస్పీ చరణ్ సైతం శుక్రవారం ఈ మేరకు ప్రకటనలు చేశారు.

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్టు అడిగిన దానికి ఆయన స్పందిస్తున్నారని, రెండ్రోజులుగా ఫిజియో థెరపీ సైతం నిర్వహిస్తున్నామని ఎంజీఎం ఆస్పత్రి బులిటెన్ లో పేర్కొంది. అయితే, బాలుకు ఇప్పటికీ వెంటిలేటర్, ఎక్మో సాయంతోనే చికిత్స కొనసాగుతున్నదని, నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని తెలిపారు.

SP Balasubrahmanyam is slowly Towards Good Health says son SP Charan

ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్ శుక్రవారం విడుదల చేసిన వీడియోలోనూ ఇదే విషయాన్ని చెప్పారు. ''నిన్నటితో పోల్చుకుంటే నాన్న ఆరోగ్యం మెరుగుపడింది. ఆయన ఊపిరితిత్తులపై కరోనా ప్రభావం తగ్గుతోందని, ఇది.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆశాజనకంగానే ఉందనడానికి సంకేతం లాంటిందేనని డాక్టర్లు చెప్పారు. నాన్న తొందరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'' అని చరణ్ వీడియోలో పేర్కొన్నారు.

ఆగస్టు మొదటి వారంలో కరోనా బారిన పడి బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. రెండో వారానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స ప్రారంభించారు. మూడో వారానికి ఎక్మో సైతం అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, నాలుగో వారానికి గానీ ఆయన కొద్దిగా కోలుకున్నారు. గడిచిన నాలుగు రోజులుగా బాలు ఆరోగ్యం మెరుగుపడుతోందని వార్తలు వస్తుండటం అభిమానులకు ఊరటనిస్తున్నది.

Recommended Video

    SP Balasubrahmanyam health condition Update By His Son S. P. Charan

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+