Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆల్‌రెడీ ఫ్లైట్ టికెట్ బుక్ అయింది: యోగి ఆదిత్యనాథ్‌పై అఖిలేష్ పంచ్‌

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఫిలిభిత్, లఖీంపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నవ్, లక్నో, రాయ్‌బరేలీ, బండా, ఫతేపూర్ జిల్లాల్లో 59 నియోజకవర్గాలకు పోలింగ్ సాయంత్రం వరకూ కొనసాగుతుంది. 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 37.45 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Recommended Video

    UP Elections 2022 Phase 4: నాలుగో దశ పోలింగ్ నేడే కీలకం, బరిలో ప్రముఖులు | Oneindia Telugu

    బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ, ప్రముఖ జానపద గాయని మాలిని అవస్థి- వంటి పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కొనసాగుతోన్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలను తీసుకున్నారు.

     SP Chief Akhilesh Yadav satire on CM Yogi Adityanath, here is the details

    సమస్యాత్మ, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు. అత్యంత సున్నిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో లఖింపూర్ ఖేరీ జిల్లా కూడా ఉండటం వల్ల అందరి దృష్టీ అటు వైపే నిలిచింది. ఇప్పటిదాకా ఉత్తర ప్రదేశ్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 10, 14, 20వ తేదీల్లో మొత్తం 172 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది.

    మరోవంక- అన్ని రాజకీయ పార్టీలు కూడా చివరి మూడు విడతల పోలింగ్ కోసం విస్తృతంగా ప్రచారం సాగిస్తోన్నాయి. సమాజ్‌వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. బహ్రెయిచ్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా లక్నోలో పర్యటించారు. ప్రఖ్యాత మరి మాత ఆలయంలో పూజలు నిర్వహించారు.

    బహ్రెయిచ్ సభలో- అఖిలేష్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారతీయ జనతా పార్టీపై ఘాటు విమర్శలను సంధించారు. బీజేపీ ప్రభుత్వం ఓడిపోబోతోందని, తాము అధికారంలోకి రానున్నామని జోస్యం చెప్పారు. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయని, ఆ మరుసటి రోజే- యోగి ఆదిత్యనాథ్ లక్నోను వీడి వెళ్లడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారని అఖిలేష్ అన్నారు.

    లక్నో నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్లడానికి యోగి ఫ్లైట్ టికెట్‌ను కూడా బుక్ చేసుకున్నారని సెటైర్లు సంధించారు. ఈ అయిదేళ్ల పరిపాలనలో బీజేపీ, యోగి ఆదిత్యనాథ్ పట్ల ఉత్తర ప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ పట్ల ప్రజల్లో 440 వోల్ట్స్ వ్యతిరేకత కనిపిస్తోందని చెప్పారు. ఆ తీవ్రత దెబ్బను అటు బీజేపీ నాయకులు గానీ, యోగి ఆదిత్యనాథ్ గానీ తట్టుకోలేరని అఖిలేష్ స్పష్టం చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+