అయోధ్యలో రామమందిరం కట్టాల్సిందే, రూ.15కోట్లిస్తా: ముస్లిం ఎమ్మెల్సీ సంచలనం

Subscribe to Oneindia Telugu

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంఎల్సీ బుక్కల్ నవాబ్ సంచలన ప్రకటన చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని కట్టాల్సిందేనని, అందుకోసం తాను రూ. 15 కోట్లను విరాళంగా ఇస్తానని అన్నారు. లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను కోల్పోయిన భూమికి నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి డబ్బు రావాల్సివుందని, అందులో నుంచే తాను దేవాలయం నిర్మాణం నిమిత్తం విరాళం ఇస్తానని అన్నారు. శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించినందున, అక్కడే రామ మందిరం నిర్మించి తీరాలని స్పష్టం చేశారు.

SP MLC Bukkal Nawab says Ram Temple must be built in Ayodhya, will donate Rs 15 crore for construction

రామమందిర నిర్మాణానికి తమ పూర్తి ఉంటుందని చెప్పారు. కాగా, బుక్కల్ కు ప్రభుత్వం నుంచి రూ. 30 కోట్ల వరకూ నష్ట పరిహారం వస్తుందని అంచనా. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Samajwadi Party MLC Bukkal Nawab has made a big announcement in connection with the construction of Ram Temple in Ayodhya.Samajwadi Party MLC Bukkal Nawab has made a big announcement in connection with the construction of Ram Temple in Ayodhya.
Please Wait while comments are loading...