స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం..: విపక్షాల స్కెచ్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా, ఉత్కంఠగా మారాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, రూలింగ్ ఇవ్వడం, మాజీ సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవణే రచించిన పుస్తకం నుండి కొన్ని భాగాలను సభలో చదవడానికి ప్రయత్నించినప్పుడు ఆయనను అడ్డుకోవడం దీనికి కారణమైంది.
పబ్లిష్ కాని పుస్తకంలో పొందుపరిచిన అంశాలను లోక్ సభలో చదివి వినిపించడం సభా నియమాలకు విరుద్ధమని అప్పట్లో స్పీకర్ వెల్లడించారు. ప్రసంగాన్ని కొనసాగించడానికి రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించారు. ప్రచురితం కాని పుస్తకంపై చర్చ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తన వాదనపై గట్టిగా నిలబడడంతో లోక్‌సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడలేకపోయారు.

ఈ సంఘటనకు ముందే, రాహుల్ గాంధీ.. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. సభలో మాట్లాడకుండా అడ్డుకోవడం పార్లమెంటరీ సంప్రదాయాల ఉల్లంఘనే అని అందులో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జాతీయ భద్రత అంశాన్ని లేవనెత్తే తన హక్కును నిరాకరించారని కాంగ్రెస్ ఆ లేఖలో స్పష్టంగా తెలిపింది. తాను పేర్కొన్న మ్యాగజైన్‌ను ధృవీకరించానని వివరించారు.
పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం, సభలో పత్రాన్ని ప్రస్తావించే సభ్యుడు దానిని ధృవీకరించి, కంటెంట్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. దీనికి భిన్నంగా స్పీకర్ వ్యవహరించినట్లు కాంగ్రెస్ భావిస్తోంది. అధికార పక్షానికి వత్తాసు పలికిందని మండిపడుతోది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా, నిబంధనలను ఉదహరిస్తూ తమ ప్రసంగాన్ని పూర్తి చేయనివ్వలేదని ఆరోపిస్తుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో - లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి కనీసం 100 మంది లోక్‌సభ సభ్యుల సంతకాలతో కూడిన దరఖాస్తు అవసరం. ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నారు. లోక్‌సభలో దీనిని ఆమోదింపజేసే మెజారిటీ కాంగ్రెస్ కు లేదు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications