ఆ చీతాలొచ్చేశాయ్..: మోదీ జన్మదిన కానుకగా..!!

భోపాల్: కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటూ వచ్చిన హాట్ టాపిక్.. ఆఫ్రికన్ చీతాస్. ఈ చీతాలు ఇప్పుడు భారత్‌కు వచ్చేశాయి. నమీబియా నుంచి వాటిని మోసుకొచ్చిన స్పెషల్ కార్గో ఎయిర్ క్రాఫ్ట్.. కొద్దిసేపటి కిందటే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ అయింది. వైమానిక దళానికి చెందిన స్పెషల్ ఫ్లైట్ ఇది. మొత్తం ఎనిమిది చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చింది.

శుక్రవారం ఈ ఫ్లైట్ నమీబియా నుంచి బయలుదేరింది. కొద్దిసేపటి కిందటే గ్వాలియర్‌లో ల్యాండ్ అయింది. గ్వాలియర్‌లో చినూక్‌తో సహా రెండు హెలికాప్టర్లలో చిరుతలను షియోపూర్ జిల్లాలోని పాల్పూర్ గ్రామానికి తరలించనున్నారు అధికారులు. పాల్పూర్ నుంచి వాటిని రోడ్డు మార్గంలో షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్‌కు తరలిస్తారు. కునో అభయారణ్యంలో వాటిని విడిచిపెట్టనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జెఎస్ చౌహాన్ తెలిపారు.

నమీబియాలోని గేమ్ రిజర్వ్ పార్క్ నుంచి ఈ ఎనిమిది చీతాలను తీసుకొచ్చారు. రోడ్డు మార్గంలో వాటిని నమీబియా రాజధాని విండ్‌హోక్‌కు తీసుకొచ్చారు. అక్కడ వాటిని ఈ స్పెషల్ కార్గో ఫ్లైట్‌లోకి ఎక్కించారు. దీనికోసం 11 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించాయి ఆ చిరుతలు. వన్యప్రాణులను ఇచ్చిపుచ్చుకోవడానికి రూపొందించిన ఇంటర్-కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ చీతాస్ ‌లో ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్.

Special cargo flight carrying 8 cheetahs from Namibia, landed at the IAF Station in Gwalior

ఒకప్పుడు భారత్- ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉండేది. 1952 నాటికి అవి అంతరించిపోయినట్లు ప్రకటించారు. మిడిల్ ఈస్ట్, మిడిల్ ఆసియా, భారత్ అంతటా విస్తరించిన చిరుతలు ఇప్పుడు అంతరించిపోతున్న ఉపజాతుల జాబితాలో చేరాయి. ఇప్పుడు ఇరాన్‌లో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటోన్నాయి. వాటి సంతతిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇంటర్-కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ చీతాస్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు.

మరోవంక- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవ్వాళ తన 72వ జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు మధ్యప్రదేశ్ అటవీ సంరక్షణాధికారి తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ స్వయంగా ఈ ఎనిమిది చీతాలను అభయారణ్యంలో విడిచిపెడతారని అన్నారు. షియోపూర్‌లోని కరాహల్‌లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌ సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+