ఆ బీచ్ కు స్పెషల్ గెస్టులు.. 12 రోజుల్లో తీరానికి 7 లక్షల తాబేళ్లు.. ఎందుకొచ్చాయంటే ?
ఒడిశాలోని జిల్లా గహీర్‌మఠ సముద్ర తీరానికి అనుకోని అతిథులు క్యూ కడుతున్నాయి. తీరం వెంబడి ఎటుచూసినా ఆలివ్ రిడ్లే తాబేళ్లు కనిపిస్తున్నాయి. 12 రోజుల వ్యవధిలో సుమారు 7 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లు వచ్చాయని భారత మత్స్య పరిశోధన సంస్థ శాస్త్రవేత్త జీవీఏ ప్రసాద్ తెలిపారు. నవంబరు నుంచి మార్చి నెలాఖరు వరకు తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం కావడంతో తీరంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. లక్షలాదిగా తాబేళ్లు ఇక్కడికి చేరుకుంటుండగా.. మరో 3 లక్షల తాబేళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.
అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రం నుంచి ఇవి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకుంటాయన్నారు. ఒక్కో తాబేలు 50 నుంచి 100 గుడ్లు పెడుతుంది. వీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తీరంలో తాబేళ్లు పెట్టే గుడ్లను పరిరక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వెన్నెల రాత్రుల్లో ఇవి తీరంలో గుడ్లు పెడతాయని చెప్పారు. పర్యాటకులను సైతం నియంత్రిస్తున్నట్లు వివరించారు.













Click it and Unblock the Notifications