వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరవర రావుకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినా..!!

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ విప్లవ కవి, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావు హైదరాబాద్‌ వెళ్లడానికి జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇవ్వలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఊరట కల్పించినప్పటికీ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు- హైదరాబాద్ వెళ్లడానికి అంగీకరించలేదు. భీమా కోరెగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన వరవరరావుకు కిందటి నెల 10వ తేదీన సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. వయస్సు, ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఆయన త్వరలోనే హైదరాబాద్‌కు వస్తారని, కుటుంబ సభ్యులను కలుసుకుంటారని భావించిరంతా. దీనికి భిన్నంగా ఎన్ఐఏ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. కంటి చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని, మూడు నెలల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించింది.

Special NIA court didnt allows Varavara Rao’s plea to go home at Hyderabad

వరవర రావును హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆయన తరఫున సీనియర్ అడ్వొకేట్ నీరజ్ యాదవ్ ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్‌పై గత ఏడాది మార్చి నుంచి ఆయన ముంబైలోనే ఉంటోన్నారని, ప్రతినెలా 70 నుంచి 80 వేల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 10 లక్షల రూపాయలను ఆయన వ్యయం చేశారని చెప్పారు.

పింఛన్ కింద వరవర రావుకు తెలంగాణ ప్రభుత్వం 50 వేల రూపాయలను చెల్లిస్తోందని- ఆ మొత్తంతో ముంబై వంటి మహానగరంలో జీవించడం కష్టమని వాదించారు. దీనికి అదనంగా ఆయన వైద్య ఖర్చులను భరించాల్సి వస్తోందని గుర్తు చేశారు. ముంబైలో క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులను వరవరరావు భరించలేకపోతున్నారని నీరజ్ యాదవ్ వాదించారు. తెలంగాణలో ఆయనకు ఉచితంగా కంటి చికిత్స చేయించుకునే అవకాశం ఉందని, కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారని చెప్పారు.

దీనిపై ఎన్ఐఏ తరపున హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకాష్ షెట్టి తన వాదనలను వినిపించారు. వరవర రావు కోరిన చికిత్స ముంబైలోనే అందుబాటులో ఉందని, తాను భరించిన వైద్య ఖర్చులను రీయింబర్స్‌మెంట్ ద్వారా తిరిగి పొందవచ్చని చెప్పారు. వాదనలను విన్న అనంతరం న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ కఠారియా తన నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌కు వెళ్లి మూడు నెలల పాటు ఉండేందుకు అనుమతిస్తే ఛార్జిషీట్‌‌ను రూపొందించడంలో ఆలస్యమౌతుందని చెప్పారు.

English summary
A special NIA court in Mumbai has rejected the request of Telugu poet and Elgar Parishad accused Varavara Rao to go to Hyderabad for three months to undergo cataract surgery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X