వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాయుసేనలోకి మరో తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్- 5000 మీటర్ల ఎత్తులోనే అన్నీ-ప్రత్యేకతలివే

|
Google Oneindia TeluguNews

భారత వాయుసేనలోకి మరో కలికితురాయి చేరింది. శత్రు వైమానిక రక్షణ వ్యవస్ధల్ని ధ్వంసం చేయగల స్వదేశీ తేలికపాటి పోరాట హెలికాప్టర్ ఇవాళ జోధ్‌పూర్ వైమానిక స్థావరంలో అధికారికంగా భారత వైమానిక దళంలో చేరింది.ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ స్వదేశీ హెలికాఫ్టర్ ను కేంద్ర ప్రభుత్వ సంస్ధ హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ తయారు చేసింది. దీని చేరికతో భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది.

వాయుసేనలోకి మరో కలికితురాయి

ప్రపంచంలోనే పటిష్టమైన వాయుసేనలు కలిగిన దేశాల జాబితాలో ఇప్పటికే చేరిన భారత్ కు ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్దితుల్లో శత్రుమూకల్ని మట్టికరిపించే యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్ల లోటు ఉంది. దీన్ని భర్తీ చేసుకునే లక్ష్యంతో దేశీయంగా ఓ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ ను తయారు చేశారు. హిందుస్దాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారుచేసిన ఈ తేలికపాటి యుద్ద హెలికాఫ్టర్(ఎల్సీహెచ్)ప్రపంచంలోని ఈ స్దాయిలో రూపొందిన తొలి హెలికాఫ్టర్ కావడం విశేషం. భారీ సంఖ్యలో ఆయుధాలు, ఇంధనంతో సముద్రానికి అత్యంత ఎత్తులో ప్రయాణించే సామర్ధ్యం దీని సొంతం.

 తయారీ నేపథ్యమిదీ

తయారీ నేపథ్యమిదీ

దేశీయంగా తయారైన ఈ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ (ఎల్సీహెచ్) భారీగా ఆయుధాలు, ఇంధనంతో 5 వేల మీటర్ల ఎత్తులో ల్యాండింగ్, టేకాఫ్ కూడా చేసేలా రూపొందించారు. ఇది అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో సైన్యం అవసరాలను తీర్చే లక్ష్యంతో తయారు చేశారు. 1999 కార్గిల్ యుద్ధం సమయంలోనే భారత్ లో యుద్ధభూమి పరిస్థితులన్నింటిలోనూ ఖచ్చితమైన దాడులు చేయగల స్వదేశీ తేలికపాటి అసాల్ట్ హెలికాప్టర్ అవసరం ఏర్పడింది. ముఖ్యంగా చాలా వేడిగా ఉండే ఎడారులలో, చాలా శీతలమైన ఎత్తైన ప్రదేశాలలో, పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులకు కౌంటర్ దాడులకు పనిచేయగల క్రాఫ్ట్ అవసరం ఏర్పడింది.

ఇదే దీని రూపకల్పనకు నాందిగా నిలిచింది. ఇప్పటికే హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ భారత్ లో ఫ్రాన్స్ కు చెందిన లెగసీ హెలికాప్టర్లు, చేతక్, చిరుతలను 3 టన్నుల కేటగిరీలో నిర్వహిస్తోంది. ఈ సింగిల్ ఇంజన్ యంత్రాలు, ప్రధానంగా యుటిలిటీ హెలికాప్టర్లు. చిరుత యొక్క సాయుధ వెర్షన్ లాన్సర్‌ను కూడా భారత దళాలు వాడుతున్నాయి.

వీటికి అదనంగా ఇప్పుడు వాయుసేన రష్యాకుచెందిన Mi-17, దాని వేరియంట్‌లు Mi-17 IV, Mi-17 V5లను కూడా వాడుతోంది. వీటి గరిష్ట టేకాఫ్ బరువు 13 టన్నులు కాగా.. వీటిని 2028 నుండి దశలవారీగా ఆపేయాలని వాయుసేన నిర్ణయించింది. దీంతో దేశీయంగానే కొత్తయుద్ధ హెలికాఫ్టర్ల తయారీ అవసరం ఏర్పడింది.

 ఎల్.సి.హెచ్. ప్రత్యేకతలివే

ఎల్.సి.హెచ్. ప్రత్యేకతలివే

ఈ ఎల్.సి.హెచ్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 5 వేల మీటర్ల ఎత్తులోనే ల్యాండింగ్, టేకాఫ్, ఆయిల్ ఫిల్లింగా్ సామర్ధ్యం దీనికి ఉంది. అలాగే 5.8 టన్నుల కేటగిరికీ చెందిన డబుల్ ఇంజిన్ కూడా దీని సొంతం. ఇందులో ఇరుకైన ఫ్యూజ్‌లేజ్, టాండమ్‌ ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. పైలట్, కో-పైలట్ కోసం కాన్ఫిగరేషన్, కోపైలట్ వెపన్ సిస్టమ్స్ ఆపరేటర్ కూడా ఉంటాయి.

గతంలో తయారు చేసిన ఇలాంటి యుద్ధ హెలికాఫ్టర్ ఎల్.ఎ.హెచ్ లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ.. ఇది ప్రధానంగా టెన్డం కాక్‌పిట్ కాన్ఫిగరేషన్‌లో మాత్రం భిన్నంగా ఉంటుంది. అత్యాధునిక రక్షణ వ్యవస్ధలతో మరింత అందంగా దీన్ని రూపొందించారు. గరిష్ట టేకాఫ్ బరువు 5.8 టన్నులు, గరిష్ట వేగం గంటకు 268 కిలోమీటర్లు, 550 కిలోమీటర్ల పరిధి, మూడు గంటలకు పైగా ప్రయాణించే సామర్ధ్యం వీటికి ఉంది. ఇది ఎగరగలిగే గరిష్ట సాంద్రత ఎత్తు 6.5 కిలోమీటర్లు. ఒత్తిడితో కూడిన క్యాబిన్ అణు, జీవ, రసాయన ఆకస్మిక పరిస్థితుల నుండి రక్షిస్తుంది.

హెలికాప్టర్‌లో శత్రు రాడార్‌లు, శత్రు క్షిపణుల ఇన్‌ఫ్రారెడ్ సీకర్ల నుండి రక్షించే కౌంటర్‌మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్‌ అమర్చారు. ఆయుధ వ్యవస్థల విషయానికొస్తే, 20 మిమీ టరెట్ గన్, 70 ఎంఎం రాకెట్లు మరియు ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ ఆన్‌బోర్డ్‌లో ఉన్నాయి. రెండు ఫ్రెంచ్ తయారీ శక్తి ఇంజిన్‌ల ద్వారా ఇది నడుస్తుంది.

 ఎన్నో పరీక్షల తర్వాత రంగంలోకి..

ఎన్నో పరీక్షల తర్వాత రంగంలోకి..

ఇప్పటికే దీన్ని నాలుగుదశల్లో విజయవంతంగా పరీక్షించారు. సముద్ర మట్టం నుంచి సియాచిన్ శ్రేణి వరకు, విపరీతమైన చలి, వేడి వాతావరణం, ఎడారి ప్రాంతాల్లో వివిధ ఎత్తుల్లో దీని పరీక్షలు నిర్వహించినట్లు హెచ్‌ఏఎల్ చెబుతోంది. నాలుగు ప్రోటోటైప్‌లు కలిసి దాదాపు 1600 విమాన గంటల పాటు 2 వేల విమానాలను నడిపాయి. ప్రస్తుతం భారత్ కు 160 తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ల అవసరం ఉంది.

వాయుసేనకు 65, ఆర్మీకి 95 కావాల్సి ఉంది. మార్చిలో కాంట్రాక్టు పొందాక, కొన్ని యూనిట్లను ఇప్పటికే పంపారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ప్రొడక్షన్ ఆర్డర్‌పై సంతకం చేసిన తేదీ నుండి ఎనిమిదేళ్లలో మిగిలిన 145 ఎల్‌సిహెచ్‌లను ఉత్పత్తి చేయడానికి సంవత్సరానికి 30 హెలికాప్టర్ల గరిష్ట రేటు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడానికి వివరణాత్మక మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించినట్లు HAL చెబుతోంది.

English summary
an indigenous light combat helicopter has been inducted into indian airforce today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X