స్పైస్‌జెట్‌ రిపబ్లిక్ డే ఆఫర్: ‘ఇండియా విల్‌ ఫ్లై సేల్‌’

న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ‘ఇండియా విల్‌ ఫ్లై సేల్‌' పేరుతో సోమవారం ప్రకటించిన ఈ ఆఫర్ ద్వారా అతి తక్కువ ధరకే దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఎంపిక చేసిన టిక్కెట్లపై డిస్కౌంట్లను ప్రకటించింది.

ఈ ఆఫర్‌లో భాగంగా దేశీయంగా టిక్కెట్‌ ప్రారంభ ధర రూ.826 కాగా, అంతర్జాతీయ టిక్కెట్‌ ప్రారంభ ధర రూ.3,026 అని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు జనవరి 25 నుంచి 27 వరకు ప్రకటించిన ఈ సేల్‌లో ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 12 వరకు బుక్ చేసుకునే టిక్కెట్లకు ప్రత్యేక ఆఫర్ వర్తించనుంది.

SpiceJet Republic Day offer: ‘India will fly sale’ cuts ticket prices to Rs 826

‘ఇండియా విల్‌ ఫ్లై సేల్‌' హైలెట్స్:

* ఈ ప్రత్యేక ఆఫర్ సోమవారం (జనవరి 25) నుంచి బుధవారం (జనవరి 27) వరకు ఉంటుంది.
* ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీలోపు ప్రయాణించేవారు ఈ టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు.
* ఒక వైపు వెళ్లే వారికి మాత్రమే ఈ సేల్‌లో డిస్కౌంట్‌ వర్తిస్తుంది.
* గ్రూప్‌ బుకింగ్‌లు, శిశువుల కోసం టిక్కెట్లు కొనే వారికి ఈ ఆఫర్‌ వర్తించదు.
* ఈ టిక్కెట్లను అమసరమైతే వేరే రూట్‌కు మార్చుకోవచ్చు. దీనికి కొంత రుసుము అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
* ఈ సేల్‌లో బుక్‌ చేసిన టిక్కెట్లను ఒక వేళ రద్దు చేసుకుంటే రిఫండ్‌ రాదు. అదనపు పన్నులు మాత్రం తిరిగి చెల్లిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+