స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ సెంటర్లు/సబ్-సెంటర్స్/ట్రెయినింగ్ సెంటర్స్ లలో వేర్వేరు విభాగాల్లో ఖాళీగా ఉన్న 176 అసిస్టెంట్ కోచ్ ల భర్తీకై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏ) న్యూఢిల్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్12,2016 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ గురించి : కేంద్రం పరిధిలోని యువజన వ్యవహారాల మంత్రివర్గంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏ) ఓ స్వయంప్రతిపత్తి గల సంస్థ.

పోస్టు పేరు : అసిస్టెంట్ కోచ్
మొత్తం ఖాళీలు : 176
పే స్కేల్ : రూ.9300-రూ.34800 తో పాటు గ్రేడ్ పే రూ.4200(ప్రీ- రివైజ్డ్)

విభాగాల పరంగా ఖాళీలు : ఆర్చరీ -12, అథ్లెటిక్స్-15,బ్యాడ్మింటన్-10,బాక్సింగ్-18,సైక్లింగ్-10,ఫుట్ బాల్-20, జిమ్నాస్టిక్స్-10, హాకి-10, జుడో-06,ఖొఖో/కబడ్డీ-04, లాన్ టెన్నిస్-06, స్విమ్మింగ్-10,వాలీబాల్-08,వాటర్ స్పోర్ట్స్-12, రెజ్లింగ్-15, వెయిట్ లిఫ్టింగ్-10

Sports Authority of India Recruitment 2017 Assistant Coaches

కనీస విద్యార్హత/ వృత్తి రీత్యా :

1) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏ)/నేషనల్ స్పోర్ట్స్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి డిప్లోమా కోచింగ్. లేదా దేశ/విదేశాల్లో ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లోమా కోచింగ్.
2) ఏసియన్ గేమ్స్ లో పాల్గొని ఉండాలి/కోచింగ్ తో పాటు వరల్డ్ ఛాంపియన్ షిప్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
3) అర్హత మరియు ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొని ఉండాలి.

ఎంపిక విధానం : ఆన్ లైన్ పరీక్ష, ఫిట్ నెస్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా స్కిల్ టెస్టు. అర్హత గల అభ్యర్థులను ఢిల్లీ,కోల్ కతా, ముంబై, బెంగుళూరు, మరియు గువాహటిలో నిర్వహించే ఆన్ లైన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏ)నిర్ణయిస్తుంది. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచినవారిని మెడికల్ టెస్టుకు పిలుస్తారు. ఆన్ లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ డిసెంబర్ 31,2016లోగా పూర్తి అయిపోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏ) అధికారిక వెబ్ సైట్ లో నవంబర్ 10,2016నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి. డిసెంబర్02,2016తో రిజిస్ట్రేషన్స్ గడువు ముగుస్తుంది.

మరిన్ని వివరాలకు :

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sports Authority of India (SAI) New Delhi invites Online Applications from eligible Indian Citizens (Sports Persons including Olympians) for filling up 176 vacancies of Assistant Coaches 2016-17 in various Sports Discipline at its various Regional Centres / Sub-Centres / Training Centres spread all over India. The last date for submission of Online registration is 12th December 2016.
Please Wait while comments are loading...