• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Sputnik Light: భారత్‌లో ఇక సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్

|

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. చాలాకాలం తరువాత 30 వేలకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. 27 వేలకు పడిపోయాయి. థర్డ్‌ వేవ్ ముప్పు ఇప్పట్లో ఉండకపోవచ్చంటూ నిపుణులు సూచిస్తోన్న నేపథ్యంలో- కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో కరోనా వైరస్ నిర్మూలన కోసం ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది.

#JusticeForChaithra: మరో దిశ: ఎన్‌కౌంటర్ కోసం డిమాండ్: పరామర్శించనున్న వైఎస్ షర్మిల#JusticeForChaithra: మరో దిశ: ఎన్‌కౌంటర్ కోసం డిమాండ్: పరామర్శించనున్న వైఎస్ షర్మిల

స్వల్పంగా పెరుగుదల..

స్వల్పంగా పెరుగుదల..

దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 27,176 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటి బులెటిన్‌తో పోల్చుకుంటే స్వల్పంగా కేసులు పెరిగాయి. కొత్తగా 284 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 38,012 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కి చేరింది. ఇందులో 3,25,22,171 మంది కోలుకున్నారు. 4,43,497 మంది వరకు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,51,087గా నమోదైంది.

75 కోట్లు దాటిన వ్యాక్సినేషన్..

75 కోట్లు దాటిన వ్యాక్సినేషన్..

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 75,89,12,277 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 61,15,690 మంది టీకాలను వేయించుకున్నట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్ కోసం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోన్న కోవిషీల్డ్, హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోన్న కోవాగ్జిన్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తోన్నారు. రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వినియోగిస్తోన్నప్పటికీ.. అది పరిమితంగానే ఉంటోంది.

ఈ మూడింటికీ భిన్నంగా..

ఈ మూడింటికీ భిన్నంగా..

కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ ఇవన్నీ డబుల్ డోస్ వ్యాక్సిన్లు. తొలి డోసు వేసుకున్న తరువాత డబుల్ కోసం కనీసం రెండు నెలల నుంచి మూడు నెలల పాటు వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పుడా పరిస్థితి లేకుండా సింగిల్ షాట్ కరోనా వ్యాక్సిన్ భారత్‌లో అందుబాటులోకి రానుంది. భారత్‌లో సింగిల్ షాట్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ వినియోగించడానికి అవసరమైన మూడో విడత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోతోంది రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్.

 స్పుత్నిక్ లైట్

స్పుత్నిక్ లైట్

గమేలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ, ఆర్డీఐఎఫ్ సంయుక్తంగా ఈ సింగిల్ షాట్ వ్యాక్సిన్‌ను డెవలప్ చేశాయి. ఇప్పటిదాకా రెండు క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది స్పుత్నిక్ లైట్. ఇప్పుడు మూడో దశలో మనుషులపై ట్రయల్స్‌ను నిర్వహించబోతోంది. దీనికి అవసరమైన అనుమతులను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆధీనంలోని సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ మంజూరు చేసింది. నిజానికి- జులైలోనే మూడో విడత క్లినికల్ ట్రయల్స్ కోసం ఆర్డీఐఎఫ్ దరఖాస్తు చేసుకుంది.

సింగిల్ డోస్ చాలు..

సింగిల్ డోస్ చాలు..

అప్పట్లో దానికి డీసీజీఐ అనుమతి ఇవ్వలేదు. అదనపు సమాచారం కావాలంటూ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. దీనితో ఇక మళ్లీ డీసీజీఐ అడిగిన పూర్తి సమాచారాన్ని అందజేసింది. వాటన్నింటినీ విశ్లేషించిన తరువాత మూడో విడత క్లినికల్ ట్రయల్స్‌కు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ షాట్ కావడం వల్ల ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటే.. సరిపోతుంది. రెండో డోస్ అవసరమే ఉండదు.

  గెలిచే అభ్యర్థికోసం అణ్వేషణ.. హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చ
  ఎఫీషియన్సీ ఎక్కువే..

  ఎఫీషియన్సీ ఎక్కువే..

  కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ 78.6 నుంచి 83.7 శాతం వరకు ఎఫీషియన్సీని సాధించినట్లు ది లాన్సెట్ జర్నల్ నిర్ధారించింది. అర్జెంటీనాలో నిర్వహించిన ట్రయల్స్ సందర్భంగా స్పుత్నిక్ లైట్ ఎఫీషియన్సీని నిర్ధారించినట్లు తెలిపింది. అర్జెంటీనాలో 40 వేల మందిపై ట్రయల్స్ నిర్వహించగా.. హాస్పిటలైజేషన్ రేటును 82.1 నుంచి 87.6 శాతం వరకు తగ్గించిందని లాన్సెట్ జర్నల్ వెల్లడించింది.

  English summary
  Sputnik Light has received the approval of the Drugs Controller General of India to conduct phase 3. The Subject Expert Committee of the DCGI recommended the phase 3 trials for Sputnik Light.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X