బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

President: శ్రీరామసేన అధ్యక్షుడిపై పిస్తోల్ తో కాల్పులు, నో లైసెన్స్, కారులో ?, రాత్రి ఏం జరిగింది ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బెళగావి: కర్ణాటకలోని బెళగావి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. బెళగావిలో కన్నడిగులు, మరాఠీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది. బెళగావి జిల్లాలో ఇప్పటికీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాంటి బెళగావిలో కాల్పులు మోత మోగింది. బెళగావి జిల్లా శ్రీరామసేన అధ్యక్షుడి మీద కాల్పులు జరిపడం కలకలం రేపింది. శ్రీరామసేన అధ్యక్షుడి మీద కాల్పులు ఎందుకు జరిగాయి అని బెళగావి నగర పోలీసు కమీషనర్ పిన్ టూపిన్ చెప్పారు.

Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?

కాల్పులు ఎందుకు జరిగాయంటే ?

కాల్పులు ఎందుకు జరిగాయంటే ?

బెళగావి జిల్లా శ్రీరామసేన జిల్లా అధ్యక్షుడిపై కాల్పులు జరిపిన కేసులో నిందితులను 24 లోపు పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై బెళగావి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.బి. బోరలింగయ్య విలేకరుల సమావేశంలో వివరాలు వెళ్లడించారు. ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత శత్రుత్వాల నేపథ్యంలోనే శ్రీరామసేన జిల్లా అధ్యక్షుడి మీద కాల్పులు జరిపారని సిటీ పోలీస్ కమీషనర్ బోరలింగయ్య వివరించారు.

బైక్ లో వెళ్లి కాల్పులు

బైక్ లో వెళ్లి కాల్పులు

శనివారం రాత్రి 7. 30 గంటల ప్రాంతంలో శ్రీరామసేన జిల్లా అధ్యక్షుడు రవి కోకిట్కర్ అలియాస్ రవి తన సహచరులు కారులో వెలుతున్న సమయంలో హిండలగ సమీపంలో కాల్పులు జరిగాయి. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు శ్రీరామసేన జిల్లా అధ్యక్షుడు రవి మీద కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన రవి ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

24 గంటల్లో నిందితులు అరెస్టు

24 గంటల్లో నిందితులు అరెస్టు

పోలీసు సిబ్బంది వెంటనే అప్రమత్తమై నిందితులను 24 గంటల్లోపు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు బెళగావిలో నివాసం ఉంటున్న అభిజిత్ భత్కండే అలియాస్ అభిజిత్ శ్రీరామసేన అధ్యక్షుడు రవి మీద కాల్పులు జరిపాడని సిటీ పోలీస్ కమీషనర్ బోరలింగయ్య మీడియాకు చెప్పారు. అభిజిత్ తో పాటు బస్తవాడ గ్రామానికి చెందిన రాహుల్, జ్యోతిబా గంగారామ్ లను అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు. అభిజిత్, రవి కోకిట్కర్ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని పోలీసులు అన్నారు,

రియల్ ఎస్టేట్.....పాతకక్షలు

రియల్ ఎస్టేట్.....పాతకక్షలు

2020 జనవరి 1వ తేదీన అభిజిత్‌పై హత్యాయత్నం జరిగిందని, అదే ఇద్దరి మద్య పగ పెంచిందని పోలీసులు అన్నారు. రివాల్వర్ కాల్పుల్లో గాయపడిన రవి కోకిట్కర్ ఈ కేసులో ప్రధాన నిందితుడ అభిజిత్ కు పాత ఆర్థికలావాదేవీల వివాదాలఉ ఉన్నాయని అందేకే రివాల్వర్ తో కాల్పులు జరిపారని పోలీసులు అన్నారు.

కంట్రీ మేడ్ పిస్తోల్.... లైసెన్స్ లేదు

కంట్రీ మేడ్ పిస్తోల్.... లైసెన్స్ లేదు

ద్వేషంతో తుపాకీని ఉపయోగించడం తీవ్రమైన నేరం అని, ప్రాథమిక సమాచారం ప్రకారం అభిజిత్ భత్కండే కాల్పులు జరిపాడని, శ్రీరామసేన నాయకుడు రవిని హత్య చెయ్యడానికి కంట్రీ మేడ్ పిస్టల్‌తో కాల్పులు జరిపారని, ఆ పిస్తోల్ కు లైసెన్స్ లేదని బెళగావిలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ బోరలింగయ్య విలేకరులకు చెప్పారు. ఈ సంఘటన బెళగావి సరిహద్దు వివాదం వలనల జరగలేదని, ప్రజలు ఎలాంటి వదంతులు, ఊహాగానాలకు వినకూడదని బెళగావి నగర పోలీసు కమీషనర్ బోరలింగయ్య ప్రజలకు సూచించారు.

English summary
Sri Ramasena district president shot with a revolver, what happened in Belagavi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X