వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా-పాక్ మ్యాచ్ గ్రూపులుగా చూడొద్దు: శ్రీనగర్ నిట్ ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: ఆదివారం నాటి ఇండియా-పాకిస్తాన్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌ను గ్రూప్‌లుగా చూడవద్దని లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దానికి సంబంధించిన ఏదైనా పోస్ట్ చేయవద్దని ఇక్కడి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) తమ విద్యార్థులను కోరింది.

Recommended Video

INDvPAK మ్యాచ్ చూస్తే రూ. 5000 జరిమానా, బహిష్కరణ!ఎక్కడంటే? *Cricket | Telugu OneIndia

స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ జారీ చేసిన నోటీసులో.. ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులు మ్యాచ్ సమయంలో తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని కోరింది.

Srinagar-NIT asks students not to watch Sunday’s India-Pakistan cricket match in groups.

"దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వివిధ దేశాలతో కూడిన క్రికెట్ సిరీస్ జరుగుతోందని విద్యార్థులకు తెలుసు. విద్యార్థులు క్రీడలను గేమ్‌గా తీసుకోవాలని, ఇన్‌స్టిట్యూట్/హాస్టల్‌లో ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని సృష్టించవద్దని ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా, విద్యార్థులు తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని, ఇతర విద్యార్థులను తమ గదుల్లోకి ప్రవేశించడానికి, సమూహాలలో మ్యాచ్‌ను చూడటానికి అనుమతించవద్దని ఆదేశించినట్లు స్పష్టం చేశారు.

"ఒక నిర్దిష్ట గదిలో మ్యాచ్‌ని చూస్తున్న విద్యార్థుల సమూహం ఉంటే, ఆ నిర్దిష్ట గదిని కేటాయించిన విద్యార్థులు ఇన్‌స్టిట్యూట్ హాస్టల్ వసతి నుంచి డిబార్ చేయబడతారు, పాల్గొన్న విద్యార్థులందరికీ కనీసం రూ. 5,000 జరిమానా విధించబడుతుంది' అని నిట్ పేర్కొంది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మ్యాచ్‌కు సంబంధించిన ఎలాంటి మెటీరియల్‌ను పోస్ట్ చేయకూడదని విద్యార్థులను ఆదేశించారు. ఇంకా, మ్యాచ్ సమయంలో లేదా తర్వాత హాస్టల్ గదుల నుంచి బయటకు రావద్దని వారికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

కాగా, 2016లో, టీ-20 వరల్డ్‌కప్ సెమీ-ఫైనల్‌లో వెస్టిండీస్‌తో భారత్ ఓడిపోయిన తర్వాత ఇన్‌స్టిట్యూట్‌లో అవుట్‌స్టేషన్, స్థానిక విద్యార్థుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో రోజులపాటు నిట్‌ని మూసివేయడానికి దారితీసింది. ఈ నేపథ్యంలో పైవిధంగా ఆదేశాలు జారీచేశారు.

English summary
Srinagar-NIT asks students not to watch Sunday’s India-Pakistan cricket match in groups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X