SSR Case: బైకుల్లాలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, సుశాంత్ మిస్, నేడు ఇంద్ర+రాణి= ఇంద్రాణి ఫ్రెండ్? !
ముంబాయి/ న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) మృతి కేసుకు సంబంధించి, మాదకద్రవ్యాల కేసులో (Drug Mafia) అరెస్టు అయిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ముంబాయిలోని బైకుల్లా జైల్లో సాధారణ ఖైదీలా ఉంటున్నది. అయితే రియా చక్రవర్తికి సుశాంత్ సింగ్ మిస్ అయినా ఇప్పుడు బైకుల్లా జైల్లో మంచి ఫ్రెండ్ చిక్కే అవకాశం ఉంది. కుమార్తె షీనా బోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఫైర్ బ్రాండ్ ఇంద్ర+రాణి= ఇంద్రాణి (ఇంద్రాణి ముఖర్జి) కూడా ఇదే బైకుల్లా జైల్లో ఉంటున్నారు. జైలుకు ఎవరు కొత్తగా వచ్చినా ప్రతాపం చూపించే ఇంద్రాణి ముఖర్జి ఇప్పుడు బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో ఎలా ప్రవర్థిస్తుందో ? అనే విషయం వేచి చూడాలి. ఇప్పటికే కొన్ని విషయాల్లో నానా రచ్చ చేసిన ఇంద్రాణి ముఖర్జికి నటి రియా చక్రవర్తి ఫ్రెండ్ గా మారిపోతుందేమో ? అనే విషయం తెలియాల్సి ఉంది.

ఏం పర్వాలేదు.... రియాకు ఏం లేదు
మాదకద్రవ్యాల కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తూనిగ తూనిగ ( 2012లో రియా చక్రవర్తి నటించిన తెలుగు సినిమా) అంటూ ముంబాయిలోని బైకుల్లా జైలుకు వెళ్లారు. న్యాయమూర్తి ఆదేశాలతో రియా చక్రవర్తికి బైకుల్లా జైలులో అక్కడి వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. రియా చక్రవర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమెకు ఎలాంటి ‘రోగం'లేదని వైద్యులు తేల్చిచెప్పారు.

రియాకు తెల్లటి దుప్పటి, చిన్న దిండు
బైకుల్లా జైల్లో సాధారణ ఖైదీలు ఉండే సెల్ లో రియా చక్రవర్తి ఉంటున్నది. రియా చక్రవర్తికి పాలిథిన్ కవర్ లో కొన్ని వస్తువులను జైలు అధికారులు అందించారు. రియా చక్రవర్తి కప్పుకోవడానికి తెల్లటి దుప్పటి, చిన్న తలదిండు, నీళ్లు తాగడానికి ఓ గ్లాసు, కొన్ని నిత్యవసర వస్తువులు మాత్రమే అందించారని తెలిసింది. రియా చక్రవర్తి ఒక సెల్ లో 40 మంది ఖైదీలతో కలిసి ఉంటోందని జైలు అధికారులు తెలిపారు.

నిన్న లగ్జరీ లైఫ్.... నేడు ?
నిన్నటి వరకు ఢాం డుస్ అంటూ లగ్జరీ లైఫ్ గడిపిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి డ్రగ్స్ కేసు దెబ్బకు నేడు బైకుల్లా జైల్లో నేల మీద పడుకుంటున్నది. నటి రియా చక్రవర్తి మొన్నటి వరకు ప్రతిరోజు ఏం కావాలంటే ఆ తిండి తినింది. కాని ఇప్పుడు రోజు రెండు చపాతీలు, ఒక కప్పు అన్నం, పప్పు (దాల్), కూరగాయలతో చేసిన సాంబార్ మాత్రమే తినడానికి అవకాశం ఉంది. అయితే జైల్లోని క్యాంటీన్ లో లభ్యం అయ్యే బిస్కెట్లు, అక్కడ చిక్కే ఆహార పదార్థాలు మాత్రమే కొనుక్కొని తినడానికి రియా చక్రవర్తికి అవకాశం ఉందని జైలు అధికారులు తెలిపారు.

జైల్లో ఫైర్ బ్రాండ్ ఇంద్ర+రాణి= ఇంద్రాణి
క్రైమ్ గురించి, అలాంటి వార్తల గురించి చిన్న అవగాహన ఉన్నా ఇంద్రాణి ముఖర్జి పేరు పెద్దగా పరిచయం చెయ్యనవసరం లేదు. కుమార్తె షీనా బోరా హత్య కేసులో అరెస్టు అయిన ఇంద్రాణి ముఖర్జి 2017 నుంచి ఇదే బైకుల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్నది. బైకుల్లా జైలుకు కొత్తగా ఖైదీలు ఎవరైనా వెళితే మేడమ్ ఇంద్రాణి ముఖర్జికి సలామ్ చెయ్యాల్సిందే అనే ఆరోపణలు ఉన్నాయి. అదే విదంగా జైలుకు కొత్తగా వచ్చే ఖైదీలను పరిచం చేసుకుంటున్న ఇంద్రాణి ముఖర్జి వారి చరిత్ర మొత్తం తెలుసుకునే అలవాటు ఉందని ఆరోపణలు ఉన్నాయి.

ఇంద్రాణి కొత్త ఫ్రెండ్ రియా ?
బైకుల్లా జైలుకు వెళ్లిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జి కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. బైకుల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్న మంజుల సేఠ్ అనే మహిళ మరణించిన సమయంలో ఇంద్రాణి ముఖర్జి నానా రచ్చ చేసి అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు, డ్రగ్స్ మాఫియా కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ఇంద్రాణి ముఖర్జి కలుస్తారా ? కలిస్తే ఏం చేస్తారు ? అనే విషయం మాత్రం వేచిచూడాల్సిందే.

నాకు ప్రాణభయం: రియా చక్రవర్తి
తనకు బైకుల్లా జైల్లో ప్రాణభయం ఉందని, వెంటనే బెయిల్ మంజూరు చెయ్యాలని బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కోర్టును ఆశ్రయించారు. తనను, తన సోదరుడు షోవిక్ లను అనసరంగా కేసుల్లో ఇరికించారని, తనకు ఈ కేసులకు ఎలాంటి సంబంధం లేదని, తన మీద ఒత్తిడి చేసి నేరం అంగీకరించేలా చేశారని ఆరోపిస్తూ రియా చక్రవర్తి ఎన్ డీపీఎస్ ప్రత్యేక కోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద బైకుల్లా జైల్లో సాధారణ ఖైదీగా ఉంటున్న రియా చక్రవర్తి, ఇంద్రాణి ముఖర్జి కలిసి మీటింగ్ పెడుతారా ? లేదా ? అనే విషయం వేచిచూడాల్సిందే.












Click it and Unblock the Notifications