దెబ్బకు దెబ్బ: 89 మంది ఎంఎల్ఏలు సస్పెండ్
చెన్నై: తమిళనాడు శాసన సభ సమావేశం బుధవారం రచ్చరచ్చ అయ్యింది. ప్రతిపక్ష శాసన సభ్యులను మూకుమ్మడిగా సస్పెండ్ చేశారు. మొత్తం 89 మంది శాసన సభ్యులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.
సభలో నియమాలు ఉల్లంఘించినందుకే వారిని సస్పెండ్ చేశామని స్పీకర్ ధనపాల్ చెప్పారు. బుధవారం తమిళనాడు శాసన సభ సమావేశాలు జరిగాయి. ఆ సందర్బంలో సమావేశంలో డీఎంకే శాసన సభ్యులు ఉన్నారు.

శాసన సభ సమావేశాలు ప్రారంభం అయిన తరువాత అధికార, ప్రతిపక్షాలకు చెందిన శాసన సభ్యులు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. సభలో గందరగోళం నెలకొంది. ఎవరు ఏమి మాట్లాడుతున్నారు అనే విషయం అర్థం కాలేదు.
ఆ సందర్బంలో జోక్యం చేసుకున్న స్పీకర్ ధనపాల్ వారం రోజుల పాటు డీఎంకే శాసన సభ్యులను సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. మార్షల్స్ 77 మంది డీఎంకే శాసన సభ్యులను బయటకు పంపించారు.
ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ను అధికార పార్టీ శాసన సభ్యులు అగౌరవంగా మాట్లాడుతున్నారని డీఎంకే శాసన సభ్యులు ఆరోపించారు.అన్నాడీఎంకే శాసన సభ్యులకు మంచి, మర్యాద తెలీదని,త్వరలోనే వారికి బుద్ది చెబుతామని డీఎంకే శాసన సభ్యులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications