అలుపెరగని పోరు బోంబే హైకోర్టుకు స్టాన్ స్వామి- యూఏపీఏలో నాన్ బెయిలబుల్ సెక్షన్ పై
దేశవ్యాప్తంగా కొంతకాలంగా ప్రభుత్వాలు తమకు నచ్చనివారిని టార్గెట్ చేసేందుకు వాడుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)ను సవాల్ చేస్తూ భీమా కొరెగావ్ కేసు నిందితుల్లో ఒకరైన స్టాన్ స్వామి బోంబే హైకోర్టును ఆశ్రయించారు. యూఏపీఏ చట్టం కింద అరెస్టైన నిందితులకు బెయిల్ దొరక్కుండా చేస్తున్న ఈ కీలక సెక్షన్ ను సవాల్ చేస్తూ స్టాన్ స్వామి హైాకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు.
భీమా కొరెగావ్ కేసులో అరెస్టై ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్టాన్ స్వామి బోంబే హైకోర్టులో యూఏపీఏ చట్టంలో నిందితులకు బెయిల్ లేకుండా చేస్తున్న సెక్షన్ 43 (డీ) (5)ను సవాల్ చేశారు. అధికారులు దర్యాప్తు సంస్ధల్ని వాడుకుంటూ బెయిల్ ను అడ్డుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 21 కింద చట్టపరమైన సమానత్వం, జీవించే హక్కులను కాలరాస్తుందని స్టాన్ స్వామి కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఈ పిటిషన్ ను బోంబే హైకోర్టు విచారణకు స్వీకరించింది.

గతేడాది అక్టోబర్ లో ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై అరెస్టైన 84 ఏళ్ల స్టాన్ స్వామి మహారాష్ట్రలోని తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కానీ ఆయన ఆరోగ్యం విషమించడం, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో కోర్టు అనుమతితో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తన అరెస్టుకు, బెయిల్ నిరాకరణకు కారణమైన యీఏపీఏ చట్టంపై ఆయన పోరాటం కొనసాగిస్తున్నారు. తనతో పాటు దేశవ్యాప్తంగా ఈ చట్టం కింద అరెస్టైన వారి హక్కుల కోసం స్టాన్ స్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications