సైబర్ ఫ్రాడ్: ఎస్బీఎం ముంబై బ్రాంచిలో రూ. 143కోట్లు మాయం, ఇదే మొదటిసారి కాదు!
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని స్టేట్ బ్యాంక్ మారిషస్(ఎస్‌బీఎం) బ్యాంక్‌లో సైబర్ దాడి జరిగింది. అయితే విషయం ఆల్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకులోని పలు ఖాతాల నుంచి దాదాపు రూ.143కోట్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
ముంబైలోని నారిమన్ పాయింట్ బ్రాంచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై బ్యాంకు అధికారులు అక్టోబర్ 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. హ్యాకర్లు బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకున్నారు.

వారి ఖాతాల నుంచి సుమారు రూ.143కోట్లను ఇతర దేశాల్లోని పలు ఖాతాలకు మళ్లించినట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. గత తొమ్మిది నెలల కాలంలో బ్యాంకులపై జరిగిన మూడో సైబర్ దాడి కావడం గమనార్హం.
ఫిబ్రవరిలో చెన్నైలోని సిటీ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌పై దుండగులు సైబర్‌దాడికి పాల్పడి రూ.34కోట్లను మళ్లించారు. ఆగస్టు నెలలో పుణెలోని కాస్మోస్ బ్యాంక్‌లోనూ ఇలాగే రూ.94కోట్లను దారి మళ్లించారు. ఎస్‌బీఎం బ్యాంక్‌పై సైబర్ దాడిలో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలోను పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications