
కేసుల ఉపసంహరణపై రాష్ట్రాలదే తుది నిర్ణయం: కేంద్రమంత్రి తోమర్ స్పష్టం
భోపాల్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతున్నలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంపై ఆయా రాష్ట్రాలదే నిర్ణయమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయం రాష్ట్రాలదే అయినందున వాటిపై తుది నిర్ణయం కూడా వారిదేనని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆందోళనలను విరమించుకోవడాన్ని కేంద్రమంత్రి తోమర్ స్వాగతించారు. కేంద్రం విడుదల చేసే నగదు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే చేరుతుందని చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దు నేపథ్యంలో ఉద్యమ సమయంలో వారిపై నమోదైన కేసుల ఉపసంహరణతోపాటు కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్లను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతలకు ఓ లేఖ రాసింది.

రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తోపాటు హర్యానా రాష్ట్రాలు అంగీకరించాయి. ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకుంటామని కేంద్రం ఆ లేఖలో పేర్కొంద.ి అయితే, వీటిపై ఆయా రాష్ట్రాలు మాత్రమే ప్రకటన చేస్తాయని తెలిపింది.
Recommended Video
దాదాపు ఏడాదికాలంగా రైతు నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామన్నారు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఇది ఎవరి విజయో? ఓటమో కాదని అన్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ దాదాపు ఏడాదికిపైగా కొనసాగిన తమ ఆందోళనలను విమరమించుకున్న విషయం తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసే రైతులు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. సంబరాలు చేసుకున్నారు. సొంత గ్రామాల్లో రైతులకు ఘన స్వాగతం లభించింది.